వీటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళనలు
విభజన నేపథ్యంలో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వీటీపీఎస్ కార్మికులు ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎదుట ఆ సంస్థ కార్మికలు ఆందోళన చేపట్టారు. విభజన నేపథ్యంలో పీఆర్సీపై వీటీపీఎస్ కార్మికుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. దాంతో కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దాంతో వీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.