vundile manchi kalam mundu munduna
-
నా పంట పండింది : నరేశ్
‘ఈ ఏడాది నా పంట పండిందనే చెప్పాలి. ఎందుకంటే నూతన దర్శకులతో సినిమాలు చేయడంతో పాటు వాటిలో దాదాపు అన్నీ విభిన్న పాత్రలే చేశాను. ఇప్పుడీ చిత్రంలో నాదో విభిన్న పాత్ర. యూత్‌ని టార్గెట్ చేసుకుని, కుటుంబ సమేతంగా చూసే విధంగా తీసిన ఈ సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. సుధాకర్ కోమాకుల, కార్తీక్ జీయస్, రాధిక, నరేశ్ తదితరులు ముఖ్య తారలుగా అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవిరాష్ నిర్మించిన ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ -‘‘టైటిల్, ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది’’ అన్నారు. ఇందులో హాకీ ప్లేయర్‌గా చేశానని కార్తీక్ చెప్పారు. మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ అని సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించి, మా చిత్రబృందానికి మంచి కాలం ముందుందని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకముందని దర్శకుడు అన్నారు. -
కొత్తదనానికి మంచికాలం : నరేశ్
‘‘సినిమాలో పంచ్ డైలాగులు ఉండడం కాదు... సినిమాలో పంచ్ ఉండటం ముఖ్యం. అలాంటి సినిమాలనే జనం ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ఆలోచనా సరళిలో మార్పొచ్చింది. హాస్యం, భావోద్వేగాలు... ఏదైనా సరే కొత్తగా ఉంటేనే చూస్తున్నారు. కొత్తదనానికి ఇప్పుడు మంచికాలం. అలాంటి సినిమాలే విజయాలందుకుంటున్నాయి. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ ఆ కోవకు చెందిన సినిమానే’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. ఆయన, రాధికా శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రధారులుగా, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం’ సుధాకర్, జీఎస్ కార్తీక్, అవంతికా మోహన్, నీతూ చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’. అరుణ్ దాస్యం దర్శకుడు. రవిరాష్ దాస్యం నిర్మాత. హైదరాబాద్‌లో నరేశ్ పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తారతమ్యం ప్రేక్షకుల్లో ఉండదు. దానికి నా ‘చిత్రం భళారే విచిత్రం’ ఓ ఉదాహరణ. ‘గ్యాంగ్‌లీడర్’ లాంటి సినిమాతో పోటీగా విడుదలై, నాలుగు కోట్లు వసూలు చేసింది. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ కూడా అలాంటి ఓ మంచి ప్రయత్నం’’ అన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నాగరాజు పాత్రను మించే స్థాయిలో ఇందులో చేసిన జాజ్ రాజ్ పాత్ర ఉంటుందని సుధాకర్ చెప్పారు. దర్శకునిగా తన తొలి ప్రయత్నం తప్పకుండా సఫలం అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. -
‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’
‘లైఫ్ ఆజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా అరుణ్ దాస్యం దర్శకత్వంలో ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’అనే టైటిల్‌ని నిర్ణయించారు.