నా పంట పండింది : నరేశ్ | vundile manchi kalam mundu munduna release 5th December | Sakshi
Sakshi News home page

నా పంట పండింది : నరేశ్

Published Wed, Nov 26 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

నా పంట పండింది : నరేశ్

నా పంట పండింది : నరేశ్

 ‘ఈ ఏడాది నా పంట పండిందనే చెప్పాలి. ఎందుకంటే నూతన దర్శకులతో సినిమాలు చేయడంతో పాటు వాటిలో దాదాపు అన్నీ విభిన్న పాత్రలే చేశాను. ఇప్పుడీ చిత్రంలో నాదో విభిన్న పాత్ర. యూత్‌ని టార్గెట్ చేసుకుని, కుటుంబ సమేతంగా చూసే విధంగా తీసిన ఈ సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. సుధాకర్ కోమాకుల, కార్తీక్ జీయస్, రాధిక, నరేశ్ తదితరులు ముఖ్య తారలుగా అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవిరాష్ నిర్మించిన ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ డిసెంబర్ 5న విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ -‘‘టైటిల్, ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది’’ అన్నారు. ఇందులో హాకీ ప్లేయర్‌గా చేశానని కార్తీక్ చెప్పారు. మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ అని సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించి, మా చిత్రబృందానికి మంచి కాలం ముందుందని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకముందని దర్శకుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement