wall felldown
-
అద్దె ఇల్లే శాపమైంది!
సాక్షి, నందిపేట్(నిజామాబాద్) : బతుకు దెరువు కోసం వచ్చిన ఆ కుటుంబంలో విధి విషాధం నింపింది. తమ పిల్లల భవిష్యత్ కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఆ దంపతుల ఆనందాన్ని గోడ కూలి ఆవిరి చేసింది. కొత్తగా దిగిన అద్దె ఇంట్లో సామగ్రి సర్దుకోక ముందే చిన్న కూతరును గోడ రూపంలో మృత్యువు కబలించింది. కొత్తగా అద్దె ఇంట్లో దిగిన గంటల వ్యవధిలోనే గోడకూలి చిన్నారి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా లింగసముందర్ మండలం ఎర్రేటిపాలెం గ్రామానికి చెందిన రావూరి అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని రామ్‌నగర్ దుబ్బ ప్రాంతంలో గల ఒక ఇంటిలో భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి అద్దెకు దిగాడు. ఉదయం 8 గంటలకు వచ్చిన వారు సామన్లు సర్దుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యభర్తలు అంజయ్య, చెంచమ్మ ఆరుబయట మెట్ల వద్ద కూర్చుని ఉండగా ముగ్గురు పిల్లలు ఆర్సీసీ బిల్డింగ్‌ను ఆనుకుని ఉన్న రేకులషెడ్డు వంట గదిలో ఆడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వంటగది రేకుల షెడ్డు గోడ ఒక్కసారిగా ముగ్గురి చిన్నారులపై కూలింది. తీవ్రంగా గాయపడిన వారి చిన్న కూతురు రేణుక(8) సంఘటన స్థలంలో మృతి చెందింది. అలాగే పెద్ద కుమార్తె శాంకుమారి(12), కొడుకు కొండయ్య(10) తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో చేరిన మొదటి రోజే కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నారి తల్లి చెంచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
పిట్టగోడ కూలి బాలుడి మృతి
కనిగిరి : మిద్దెపైన కట్టిన పిట్ట గోడ కూలి బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని కొత్తపేట వడ్డెర కాలనీలో గురువారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వడ్డెర కాలనీలో నివసిస్తున్న రాజశేఖర్, అనుషా దంపతుల మూడేళ్ల కుమారుడు రోని షమ్షీల్ (చెర్రీ)ను తల్లి మిద్దెపైకి తీసుకెళ్లి గోరుముద్దలు తీనిపిస్తోంది. ఈ క్రమంలో చెర్రీ ఆడుకుంటూ పిట్ట గోడ వద్దకు వెళ్లాడు. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పిట్టగోడపై బాలుడిని కూర్చుబెట్టి టిఫెన్ తినిపిస్తుండగా అటు ఇటు కదలడంతో పిట్టగోడ కూలింది. చెర్రీ పక్కన అనుకుని ఉన్న మరో మిద్దెపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదేళ్ల తర్వాత కలిగిన సంతానం కావడంతో కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. అప్పటి వరకూ కళ్లముందు ఆడుకుంటూ గోరుముద్దలు తిన్న తనయుడు క్షణాల వ్యవధిలో మృత్యువడికి చేరడంతో తల్లిదండ్రులు చేసే రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
జూబ్లీహిల్స్‌లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం
-
జూబ్లీహిల్స్‌లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎత్తైన కొండపై గల ఓ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ్ కూలి.. కింద రోడ్డుపై నిలిపిఉన్న వాహనాలపై కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు 10 కార్ల వరకు శిథిలాల కింది నలిగిపోయాయని, విద్యుత్ లైన్లు తెగిపడటంతో సరఫరాను నిలిపివేశామని, సహాయక చర్యలు కొనసాగుతాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు. -
నిద్రలోనే మృత్యు ఒడిలోకి..
బనగానపల్లె: ఆటపాటలతో అల్లరి చేసే అ చిన్నారి నిద్రలోనే శాశ్వతంగా మృత్యు ఒడికి చేరింది. మిద్దె గోడ రాళ్లు కూలి మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన బనగానపల్లె పట్టణం గౌండవీధిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇర్ఫాన్-మసరత్ దంపతుల కుమార్తె అయిన మర్జియా అతహర్(3) ఇంటిలో నిద్రిస్తుండగా గోడ మెత్తు ఒక భాగం బాలికపై కూలింది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి పక్క భాగంలో ఉన్న ఇళ్ల ప్లానింగ్ అధికారి మగ్బుల్ హుస్సేన్ నూతన ఇంటిని నిర్మించేందుకు తన పాత ఇల్లు తొలగింపు సమయంలో బీము కూల్చుతుండగా దాని చివరి భాగం ఇర్ఫాన్ ఇంటి గోడలోకి దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. బీమును కూల్చుతున్న విషయం ముందు జాగ్రత్తగా తమకు తెలపాల్సిన అవసరం ఉందని, మృతి చెందిన బాలిక కుటుంబీకులు వాపోతున్నారు. ఇర్ఫాన్-మసరత్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె. ఉన్న ఒక్క కుమార్తె మృతి చెందడం తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. బనగాపల్లె ఎస్ఐ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ కన్వీనర్ పరామర్శ.. బాలిక మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇర్ఫాన్ ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.