wall writings
-
కెనడాలో ఆలయం వద్ద విద్వేష ఘటన
టొరొంటో: హిందూ వ్యతిరేక శక్తులు కెనడాలో మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్ నగరంలోని బాప్స్ స్వామినారాయణ ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఇందుకు పాల్పడ్డవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దీన్ని ఒట్టావాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. జనవరిలో సైతం కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్ నగరంలోని గౌరీశంకర్ ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గతేడాది సైతం కెనడాలో ఇలాంటి మూడు ఘటనలు జరిగాయి. కెనడా గణాంకాల ప్రకారం 2019–2021 మధ్య మత, లింగ, జాతివిద్వేష నేరాలు 72 శాతం పెరిగాయి. కెనడా జనాభాలో 4 శాతమున్న భారతీయుల్లో ఇవి అభద్రతను పెంచుతున్నాయి. ఈ శక్తులకు అడ్డుకట్టవేయాలని కెనడా సర్కార్‌ను భారత్ కోరింది. -
వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం!
హైదరాబాద్: నగరంలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధాన్ని కచ్చితంగా అమలుచేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సోమవారం జీహెచ్ఎంసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చెత్త సమస్య, నాలాల ఆక్రమణ, మంచినీటి సరఫరాపై సుధీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు వాల్ పోస్టర్ల సమస్య, వాల్ రైటింగ్స్ పై కూడా చర్చించి వాటిపై నిషేధాన్ని తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.