War Machine
-
హాలీవుడ్ ఎటాక్
చోటు: షారుక్ ఖాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు మోటు: కాదురా.. టెన్షన్‌తో కొట్టుకుంటున్నాడు. చోటు: వాట్స్ హిజ్ ప్రాబ్లమ్? మోటు: హాలీవుడ్ బాలీవుడ్‌ని ఎటాక్ చేస్తుందట. చోటు: సినిమా కథలు చెప్పకు.. ఇంకా బలిసి బ్లాస్ట్ అవుతావు. చోటు: పుల్లలాగా ఉన్నావు. ఒక్కటి పీకానంటే టూ పీస్ అవుతావు. చోటు: ట్రాక్ మార్చకుండా షారుక్ ప్రాబ్లమ్ ఎంటో చెప్పు. మోటు: మనోళ్లకు స్క్రీన్‌ప్లే రైటింగ్ రాదట! చోటు : వాట్? మోటు: మార్కెటింగ్ రాదట, టెక్నాలజీలో వీక్ అట, డిజిటల్ వేల్యూస్‌లో జీరో అట. చోటు : హవ్వ.. హవ్వ... మోటు: అమెరికన్ హీరో బ్రాడ్ పిట్ తన డిజిటల్ సినిమా ‘వార్ మెషీన్’ ప్రమోషన్‌కి వచ్చి కొట్టిన కొట్టుడుకి బెంబేలెత్తిపోయి హాలీవుడ్ ఎటాక్ స్టార్టయ్యింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. బాలీవుడ్‌ని క్యాప్చర్ చేసేస్తారు అని షారుక్ భోరునlఏడుస్తున్నాడు. చోటు: ఒకసారి ‘బాహుబలి’ చూడమను... బాలీవుడ్‌ని కాపాడేది టాలీవుడ్ అని తెలుస్తుంది. -
'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను'
ముంబై: బాలీవుడ్ లో నటించేందుకు తనకు కొన్ని లక్షణాలు లేవని హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ అభిప్రాయపడ్డాడు. తన లేటెస్ట్ మూవీ 'వార్ మేషిన్' ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరో భారత్ లో పర్యటిస్తున్నాడు. ముంబైలో ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ.. బాలీవుడ్ మూవీలలో నటించాలని ఉంది. కానీ డ్యాన్స్ రాని కారణంగా ఎప్పటికీ ఆ పని చేయలేనని చెప్పాడు. 'వార్ మేషిన్' డైరెక్టర్ డేవిడ్ మిచోడ్, మూవీ యూనిట్ తనకెంతో సహకారం అందించిందని, బడ్జెట్ ను పట్టించుకోకుండా రిస్క్ తీసుకుని మూవీ చేయడం మూవీ యూనిట్ కు అలవాటని అందుకే తాను ఈ మూవీలో నటించానని బ్రాడ్ పిట్ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరై బ్రాడ్ పిట్ ను సరదాగా ఆటపట్టించాడు. 'బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. కావాలంటే నువ్వు కూడా ఒకసారి రెండు చేతులను ముందుకు, పక్కకు అలా చాచిపెట్టు. అదే నీ డ్యాన్స్ అయిపోతుంది' అని షారుఖ్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. బ్రాడ్ పిట్ నటించిన '12 మంకీస్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' మూవీలు చూసి ఆయన అభిమానిగా మారానని షారుక్ వివరించాడు.