'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను' | I Would never work in Bollywood, says Brad Pitt | Sakshi
Sakshi News home page

'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను'

Published Thu, May 25 2017 2:51 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను'

'బాలీవుడ్ మూవీలో ఈ జీవితంలో నటించను'

ముంబై: బాలీవుడ్ లో నటించేందుకు తనకు కొన్ని లక్షణాలు లేవని హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ అభిప్రాయపడ్డాడు. తన లేటెస్ట్ మూవీ 'వార్ మేషిన్' ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరో భారత్ లో పర్యటిస్తున్నాడు. ముంబైలో ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ.. బాలీవుడ్ మూవీలలో నటించాలని ఉంది. కానీ డ్యాన్స్ రాని కారణంగా ఎప్పటికీ ఆ పని చేయలేనని చెప్పాడు. 'వార్ మేషిన్' డైరెక్టర్ డేవిడ్ మిచోడ్, మూవీ యూనిట్ తనకెంతో సహకారం అందించిందని, బడ్జెట్ ను పట్టించుకోకుండా రిస్క్ తీసుకుని మూవీ చేయడం మూవీ యూనిట్ కు అలవాటని అందుకే తాను ఈ మూవీలో నటించానని బ్రాడ్ పిట్ చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరై బ్రాడ్ పిట్ ను సరదాగా ఆటపట్టించాడు. 'బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. కావాలంటే నువ్వు కూడా ఒకసారి రెండు చేతులను ముందుకు, పక్కకు అలా చాచిపెట్టు. అదే నీ డ్యాన్స్ అయిపోతుంది' అని షారుఖ్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. బ్రాడ్ పిట్ నటించిన '12 మంకీస్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' మూవీలు చూసి ఆయన అభిమానిగా మారానని షారుక్ వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement