waranga
-
కిక్కు తగ్గింది..
కాజీపేట అర్బన్: అలిసిన మనసుకు సాంత్వన కలుగుతుందని కొందరు.. అలవాటుతో మరికొంద రు.. బానిసలై ఇంకొందరు సాయంత్రం అయిందంటే మద్యం తాగాల్సిందే! అయితే, డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన కొన్ని బ్రాండ్ల మందు ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎలాగూ మద్యపాన ప్రియులు మందులో నీళ్లు కలుపుతారు కదా.. అదే పని మేమే చేస్తే పోలా.. అన్న భావనతో కొందరు వైన్స్, బార్ల యజమానులు ఇష్టారాజ్యంగా మందు కల్తీ చేసేస్తున్నారు. తద్వారా రూ.లక్షలు గడిస్తున్న ఈ మాఫియా, మందు బాబుల జేబులను గుళ్ల చేస్తోంది. నిలదీస్తేనే... పని ఒత్తిడిలో అలసిపోయి, శుభకార్యాల్లో ఆనందంగా గడిపేందుకు మద్యం ప్రియులు మద్యం షాపులకు వెళ్తుంటారు. సాధారణంగా క్వార్టర్ సీసా తాగితే కిక్కుతో ఊగిపోయే వారికి సైతం ఫుల్ బాటిల్ తాగినా కిక్కు ఎక్కడం లేదట! దీంతో మద్యం షాపు నిర్వాహకులను నిలదీయడంతో మద్యంలో కల్తీ జరిగిన విషయం బట్టబయలవుతోంది. ఫలితంగా మందు బాబులకు కిక్కు ఎక్కకున్నా.. మద్యం షాపుల్లోని గల్లాలు మాత్రం కళకళలాడుతున్నాయి. వేసిన సీల్ వేసినట్లే.. మద్యం బాటిళ్ల మూతకు వేసిన సీల్ వేసినట్టుగానే ఉంటుండగా.. మద్యం మాత్రం కల్తీ అవుతోంది. మద్యం బాటిళ్ల మూతలను ప్రత్యేక పరికారాలతో తీసేయడం.. నీళ్లు కలిపాక మళ్లీ మూత పెట్టడం నిష్ణాతులకే సాధ్యమవుతుంది. దీనికోసం కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన మద్యం మాఫియా ఎక్కువగా అమ్ముడయ్యే ఒరిజినల్ చాయిస్, రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైడ్ వంటి బ్రాండ్ల మందు బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ నెలవారిగా బార్లు, వైన్స్ నుంచి అందే మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు తేలిపోతూ.. మద్యం షాపుల తనిఖీల మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టడం, సమయపాలన పాటించేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఇక బెల్ట్ షాపుల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట విషయానికొస్తే కొన్ని నెలలుగా సమయపాలన, కల్తీ విషయంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. నగరాల్లో బ్రాండ్ మిక్సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మద్యాన్ని నీటితో కల్తీ చేస్తుండగా కాజీపేట, హన్మకొండ, వరంగల్‌తో పాటు నగరాల్లో ఎక్కువ రేటు బ్రాండ్ మద్యంలో తక్కువ రేటు బ్రాండ్ మద్యాన్ని కలిపేస్తున్నారు. ఇటీవల హన్మకొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కిక్కు ఎక్కడం లేదంటూ మందు బాబులు ఏకంగా గొడవకు దిగిన విషయం విదితమే. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. జనగామలోని వైన్‌షాపులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా నీళ్లు కలిపిన 27 బాటిళ్లు లభ్యమయ్యాయి. ములుగు జంగాలపల్లిలో వైన్‌షాపులో ఏకంగా 500 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించడం గమనార్హం. ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకుని 20 బాటిల్లు, మూతలు, క్యాన్లలోని లూజ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వైన్స్‌లో 19 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించాయి. -
నేటి నుంచి నిట్ వజ్రోత్సవాలు
కాజీపేటలోని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకలను సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యాజమాన్యం పూర్తి చేసింది. పోలీసు విభాగం ఆధ్వర్యంలో 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. కాజీపేట అర్బన్ (వరంగల్): కాజీపేటలోని వరంగల్ నిట్‌లో ఏడాది పొడవునా వజ్రోత్సవాలు నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు 1959 అక్టోబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నేహ్రు శకుస్థాపన చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి 60వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రారంభించేందుకు సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవల నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు ఉపరాష్ట్రపతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏడాది పొడవునా వజ్రోత్సవాలు ఏడాది పొడవున వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిట్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు స్పిక్‌మేకే బృందంచేత విరాసత్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, నవంబర్ 10 నుంచి 12 వరకు ఎవెల్యూషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్షన్స్–ఇష్య్సూ–కన్సరŠన్స్ అనే అంశంపై జాతీయ సదస్సు, డిసెంబర్ 18 నుంచి 21 వరకు 6వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిగ్‌డాటా, డిసెం బర్ 15, 16 తేదీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డైనమిక్స్ ఆఫ్ ఇంటర్ఫేసేస్ ఇన్ మల్టీఫేస్ సిస్టమ్స్, జనవరి 18 నుంచి 20 వరకు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కాంపిటేషనల్ మోడలింగ్ ఆఫ్ ప్లూయిడ్స్ డైనమిక్ ప్రాబ్లెమ్స్, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్›డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ డివైసెస్‌లను నిర్వహించనున్నారు. వీటితోపాటు వివిధ కళాశాలలు, సంస్థల నుంచి ఎంఓయూలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన షెడ్యూల్.. నిట్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి సోమవారం ఉదయం 9.20 నిమిషాలకు చేరుకుంటారు. కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో 9.30 నిమిషాలకు నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్‌కు వచ్చాక తొలుత నిట్ వజ్రోత్సవ వేడుకల శిలాఫలకాన్ని, అల్యూమ్ని కన్వెన్షన్ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. నాటి ఆర్ఈసీ ప్రిన్సిపాల్స్, నేటి నిట్ డైరెక్టర్లను సన్మానించి నిట్ వజ్రోత్సవ వేడుకలపై ఉపన్యసిస్తారు. తిరిగి 10.30 నిమిషాలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయల్దేరుతారు. 600 మంది పోలీసులతో బందోబస్తు వరంగల్ క్రైం: వజ్రోత్సవాలకు ముఖ్యఅతిథిగా వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆదివారం రాత్రి సుమారు గంటపాటు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. అధికారులు ఎక్కడెక్కడ ఎవరుండాలనే విషయాలతోపాటు బందోబస్తు విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించా రు. బందోబస్తు కోసం సుమారు 600 మంది సిబ్బంది, అధికారులను నియమించినట్లు సమాచారం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు. -
వరంగల్‌లో బతుకమ్మ సంబరాలు
-
ఎవరి ధీమా వారిదే
-
ఎవరి ధీమా వారిదే
వరంగల్ లోక్‌సభ స్థానంలో గెలుపుపై పార్టీల అంచనాలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగియగానే ఓటింగ్ సరళిపై రాజకీ య పార్టీలు అంచనాల్లో పడ్డాయి. గెలుపుపై ఎలాంటి అనుమానాల్లేవని, కేవలం మెజారిటీ కోసమే వరంగల్‌లో పనిచేశామంటూ టీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఇక పోలింగ్ శాతం తగ్గడం, హామీలను అమలు చేయనందుకు ప్రభుత్వంపై వ్యతిరేకతకుతోడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తాము బాగా పుంజుకున్నామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం, వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం వివిధ పథకాలు, టీడీపీతో పొత్తు వంటి వాటితో గెలుపు అవకాశాలున్నాయని బీజేపీ చెబుతోంది. టీఆర్ఎస్కు అనుకూలమంటున్న 'ఎగ్జిట్' సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కడియంకు 3.95 లక్షల మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలోనూ ఆ పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్, సర్వేలు చెబుతున్నాయి. లక్ష నుంచి లక్షన్నర దాకా మెజారిటీ రావొచ్చని పేర్కొంటున్నాయి. అయితే ఓటింగ్‌శాతం తగ్గడంతో టీఆర్ఎస్ విజ యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపఎన్నికల్లో సాధారణంగానే పోలింగ్ శాతం తగ్గుతుందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ‘ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే. టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం కోసం కొందరు మెజారిటీ అంటూ వాదనను తెరపైకి తెస్తున్నారు. ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వ మనుగడపై ప్రభావమేమీ ఉండదనే కారణంతో ఓటర్లు నిరాసక్తత చూపుతారు.’’ అని ఒక మంత్రి పేర్కొన్నారు. తడబడి.. నిలదొక్కుకున్న కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో దుర్ఘటనతో కాంగ్రెస్‌పార్టీ షాక్‌కు గురైంది. ఆ వెంటనే సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా తెరపైకి తెచ్చి తేరుకుంది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్, కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోపాటు ఆజాద్, దిగ్విజయ్ వంటి జాతీయ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ఉన్న సానుకూలత, తెలంగాణ బిల్లుకోసం మద్దతిచ్చిన పార్టీగా, వరంగల్‌కు పలు పథకాలను ప్రకటించడం వంటివి ఈ ఉప ఎన్నికలో ఉపయోగపడతాయని బీజేపీ ఆశిస్తోంది.