అగ్గి సోకితే.. బుగ్గే
దుగ్గొండి : రబీలో నీటి వసతి ఉన్న రైతులు అక్కడక్కడా వరి పంట సాగు చేశారు. కొందరు సా ధారణ రకాలయిన 1010, ఎర్రమల్లెలు, ఐ ఈర్-64 రకాలు సాగు వేయగా మరికొందరు బేయర్, పయనీర్ కంపెనీలకు చెందిన ఆడమగ వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట చిరుపొట్టదశ ప్రారంభంలో ఉంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అగ్గితెగులు లక్షణాలు కనబడుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే తెగులు ఉధృతి చెంది పంటకు తీవ్ర నష్టం కలుగుతుందని వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెగులు లక్షణాలు-నివారణ చర్యలు వివరించారు.
కారణాలు
రాత్రిపూట చలి ఉండి పొద్దంతా వేడి వాతావరణం ఉండడం వల్ల అగ్గి తెగులు సోకుతుంది.
పంట పెరుగుదల లేదని భావించి కొందరు రైతులు నత్రజనిని మోతాదుకు మించి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల తెగులు వస్తుంది.నారు పోసే ముందు విత్తనశుద్ధి చేయకపోరుునా.. తెగులు అవశేషాలు ఉన్న విత్తనాలతో నారు పోసినా అగ్గి తెగులు సోకుతుంది.
లక్షణాలు
వరి ఆకులపై మొదట నూలు కండె ఆకారంలో చిన్న చిన్న మ చ్చలు ఏర్పడతాయి. {Mమేణా మచ్చలు పెద్దగా మారి ఆకు మొత్తం వ్యాపిస్తుంది. ఆకుతో సహా కుదురు ఎండిపోతుంది.తెగులు ఆరంభ దశలో నిర్లక్ష్యంగా ఉంటే వరి గొలుసులు బయటికి వచ్చాక మెడవి రుపు వచ్చి గింజలన్నీ తాలుగా మారిపోయి 70 శాతం దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ
ఆకులపై నూలు కండె మచ్చలు వచ్చినట్లు గమనించగానే లీటరు నీటికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ మందును కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని వాడకం నిలిపి వేయాలి.నీటిని అధికంగా కాకుండా పలుచగా పెట్టాలి.చౌడు నేలల్లో అధికంగాా అగ్గితెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తీవ్రత తగ్గించు కోవడానికి కూలీల చేత భూమిని కదిలించాలి. దీంతో వేర్లకు గాలి ధారళంగా అంది తెగులు కొంత వరకు తగ్గుతుంది.
డాక్టర్ రఘురామిరెడ్డి
99896 25223