Warden posts
-
ఈ బాధ్యత నాకొద్దు
ఒకప్పుడు రెగ్యులర్ హాస్టల్‌తో పాటు వేరే హాస్టళ్లకు ఇన్చార్జిగా పని చేయడానికి పోటీ పడిన వార్డెన్లు.. ఇప్పుడు ఇన్చార్జి బాధ్యతలు తమకొద్దంటూ వరుసకట్టి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పక్క హాస్టళ్లకు ఇన్చార్జి బాధ్యతలను దక్కించుకోవడానికి పావులు కదిపిన వార్డెన్లే.. ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలంటూ అధికారులను కోరుతున్నారు. ఇటీవలి సన్నబియ్యం తరలింపు వ్యవహారంతోపాటు, అదనపు బాధ్యతల భారం కారణంగా ఇన్చార్జిగా కొనసాగలేమంటున్నారు. ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇటీవల సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడంతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కొందరు హాస్టళ్ల వార్డెన్లు ప్రయత్నాలు చేయడం ఆయా సంక్షేమశాఖల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానంగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు ఇన్చార్జిలుగా తాము పని చేయలేమని స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో వార్డెన్‌కు రెండు నుంచి మూడు వరకు హాస్టళ్ల బాధ్యతలు ఉండటం మూలంగా ఏ హాస్టల్‌కు న్యాయం చేయలేకపోతున్నామని మరికొంత మంది వార్డెన్లు అధికారుల ముందు వాపోతున్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 82 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా, 10 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. బీసీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 19 ఉండగా, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 13 ఉన్నాయి. అదే విధంగా ఎస్టీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు 4, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 4 ఉన్నాయి. మొత్తం 82 హాస్టళ్లలో బీసీ –11, ఎస్సీ– 14, ఎస్టీ–2 చొప్పున మొత్తం కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్లు లేక గత కొన్నేళ్లుగా ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారు. అత్యధికంగా ఎస్సీ, బీసీ హాస్టళ్లే ఇన్చార్జిలతో నడుస్తున్నాయి. అయితే రెగ్యులర్ హాస్టల్‌తో పాటు ఖాళీగా ఉన్న వేరే హాస్టళ్లకు ఇన్చార్జిలుగా పని చేయడానికి పోటీపడి.. ఒక్కొక్కరు రెండు, మూడు హాస్టళ్లకు పని చేశారు. ఇటీవల హాస్టల్ సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడం.. అది కూడా వార్డెన్లు ఇన్చార్జిగా పని చేస్తున్న హాస్టళ్లే కావడం విశేషం. దీంతో మిగతా వార్డెన్లకు గుబులు పట్టుకుంది. ఇన్చార్జులుగా పని చేసి బుక్కయ్యే దానికంటే రెగ్యులర్ హాస్టల్‌కు పని చేయడమే మేలని భావించి ఇన్చార్జి బాధ్యతలను తొలగించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. భారం కూడా కారణమే.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్లు లేక చాలాకాలంగా ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు, నుంచి మూడు హాస్టళ్ల అదనపు బాధ్యతలు ఉండటం మూలంగా కొంతమంది వార్డెన్లు ఏ హాస్టల్‌కు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఒకే రోజు రెండు, మూడు హాస్టళ్లకు ఉదయాన్నే వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించడం సాధ్యం కావడం లేదు. దీంతో హాస్టళ్ల పాలన గాడితప్పుతోంది. ఇటు ప్రభుత్వం కూడా వార్డెన్ ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కూడా ఉన్న వార్డెన్లపైనే భారం పడుతోంది. అన్ని శాఖల్లో పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు లేక ప్రీ మెట్రిక్ హాస్టళ్ల రెగ్యులర్ వార్డెన్లే ఇన్చార్జిలుగా పని చేస్తున్నారు. హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు ఎస్సీ 14, బీసీ 11, ఎస్టీ 02, మొత్తం 27 -
సాంఘిక సంక్షేమశాఖలో బదిలీలు కరువు
► గత మూడేళ్లుగా ఇన్‌చార్జీలే దిక్కు ► కల్పించని పదోన్నతులు ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో చెన్నూర్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో మూడేళ్లు నుంచి సాధారణ బదిలీలు కరువయ్యాయి. ఇన్చార్జి వార్డెన్లతోనే హాస్టళ్ల నిర్వహణ సాగుతోంది. సీనియార్టీ ఉన్న వార్డెన్లకు పదోన్నతులు లేక ఏళ్లు గడుస్తున్నాయి. వారి బదిలీల గురించి ప్రభుత్వం సైతం ఆలోచించడం లేదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి సాధారణ బదిలీలు నిర్వహించాల్సిన ప్రభుత్వం మూడేళ్లుగా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో జిల్లాలో 75 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉండగా 35 మంది సంక్షేమాధికారులు మాత్రమే ఉన్నారు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 56 బీసీ హస్టళ్లు ఉండగా 30 మంది వార్డెన్లు ఉన్నారు. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో హాస్టళ్లలో ఇంచార్జి వార్డెన్ల పాలనే కొనసాగుతుంది. వార్డెన్లకు మెమోలు జారీ జిల్లాలో 30 వసతి గృహాలు ఇన్చార్జి వార్డెన్లతోనే నిర్వహ ణ సాగుతోంది. కొంత మంది వార్డెన్లను టౌన్‌ప్లానింగ్ అ దికారులుగా, కళ్యాణ లక్ష్మి పథకంపై సర్వే అధికారులుగా నియమించారు. దీంతో పని భారం పెరిగి వార్డెన్లు విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఈ ఏడాది పది పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదని వార్డెన్లకు మె మోలు జారీ చేశారు. ఒక్కో వార్డెన్‌కు రెండేసి హాస్టల్స్ ఉండడంతో విద్యార్థుల బాగోగులు సక్రమంగా చూడలేకపోతున్నామని పలువురు వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారిగా తాము విధులను సక్రమం గా నిర్వహిస్తున్నప్పటికి రాత్రి వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతోనే విద్యార్థులు పది పరీక్షల్లో ఆశించిన మేరకు ఉత్తీర్ణత సాధించలేకపోయారని పలువురు వార్డెన్లు ఆరోపిస్తున్నారు. సాధారణ బదిలీలు తప్పని సరి ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలు తప్పని సరిగా నిర్వహిస్తారు. గత కొంత కాలంగా బదిలీలు లేకపోవడంతో అధికారుల్లో నిరాసక్తత వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉ న్న ఉద్యోగులు పట్టణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాల్లో ఉ న్న ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయడంతో వా రిలో విధుల పట్ల ఉత్సాహం కలుగుతుంది. ఏళ్ల కొద్ది ఒకే చోట ఉండడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం విద్యా సంవత్సర ప్రారంభంలోనే బదిలీలు చేపట్టాలని వార్డెన్లు కోరుతున్నారు. మరో వారం రోజుల్లో వసతి గృహాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల, వార్డెన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బదిలీలు చేపట్టి ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని, అర్హత, సీనియార్టీ ఉన్న వార్డెన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. సాధారణ బదిలీలు నిర్వహించాలి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాధారణ బదిలీల అనంతరం నేటి వరకు బదిలీలు చేపట్ట లేదు. ఏళ్లుగా వార్డెన్లు ఒకే చో ట ఉండాల్సిన పరిస్థితి నెల కొంది. వార్డెన్ పోస్టులు భర్తీ కా కపోవడంతో ఒక్కో వార్డెన్ రెండేసి హాస్టళ్లకు ఇన్చార్జిలుగా ఉంటున్నారు. విద్యార్థులకు న్యా యం చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపట్టి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.- ఏస్కూరి జ్ఞానానందం, తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, చెన్నూర్