Water bill arrears
-
హైదరాబాద్ వాసులకు సువర్ణావకాశం..
సాక్షి, హైదరాబాద్: జలమండలి నీటి బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు మరో వారం రోజుల్లో ముగియనుంది. గడువు కాలంలో పెండింగ్ బిల్లులను చెల్లిస్తే ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందవచ్చు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులకు జలమండలి సువర్ణావకాశం కల్పించింది. వినియోగదారులు సకాలంలో బకాయిలు చెల్లించే విధంగా విస్తృత ప్రచారం చేపట్టింది. బకాయిలున్న కనెక్షన్లు 7 లక్షలపైనే.. జలమండలి పరిధిలో సుమారు 13.50 లక్షలు నల్లా కనెక్షన్లు ఉండగా అందులో సుమారు 7.1 లక్షల కనెక్షన్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద దాదాపు రూ.1,706 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఆలస్య రుసుముతో పాటు వడ్డీ రూపంలో ఉన్న రూ.1,189 కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి.చెల్లింపు విధానం ఇలా.. జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లల్లో చెల్లించవచ్చు. ఆన్లైన్ విధానంలో.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా NEFT, RTGS, BPPS ద్వారా.. జలమండలి అధికారిక వెబ్ సైట్ hyderabadwater.gov.in/enకు లాగిన్‌తో.. లైన్మెన్లు గృహాలను సందర్శించినప్పుడు వారి దగ్గర ఉండే EPOS యంత్రం ద్వారా కూడా చెల్లించవచ్చు. మీ సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా సై తం బిల్లు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. జలమండలి అందించే QR Code స్కాన్ చేసి చెల్లించవచ్చు.వడ్డీ మాఫీ పరిధి ఇలా.. నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ బిల్లు మాఫీ చేసే అధికారం ఉంది. మొబైల్ నంబర్లకు సమాచారం జలమండలి పెండింగ్ బిల్లుల వినియోగదారుల క్యాన్ నంబర్‌కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు బకాయి మొత్తం, ఎంత చెల్లించాలి, ఎంత మాఫీ అవుతుంది తదితర వివరాలన్నీ సంక్షిప్త సమాచారం పంపిస్తోంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్ బుక్, ఎల్రక్టానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఓటీఎస్–2024 పథకం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్నారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!సద్వినియోగం చేసుకోవాలిపెండింగ్ బిల్లుల వినియోగదారులు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలి. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో బిల్లులన్నీ కొండలా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దికొద్దిగా పుంజుకుంటున్నా, ప్రభుత్వం ఇతర ప్రధాన పథకాలకు ఎక్కువగా నిధులు వెచ్చిస్తుండటంతో సాగునీటి బిల్లులకు మోక్షం కలగడంలేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొన్ని ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల కింద చెల్లింపులు చేసినప్పటికీ ఇంకా రూ.11,989 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. కొంత ఇచ్చినా..ఇంకా చాలా పెండింగ్.. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు రూ.11 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నుంచి కరోనా విస్తృతి పెరిగిన అనంతరం ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడటంతో బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. జూన్ రెండోవారం నుంచి పరిస్థితి కొంత మెరుగైనా రైతుబంధు, ఇతర ప్రాధాన్య పథకాలకు నిధులు ఇవ్వాల్సి రావడంతో సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో బిల్లులు భారీగా పేరుకుపోయాయి. జూన్ చివరలో కేవలం రూ.785 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరగ్గా, జూలై, ఆగస్టు నెలల్లో రూ.3,300 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.11,989 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో కరెంట్ బిల్లులు, భూసేకరణ బిల్లులు రూ.5 వేల కోట్ల మేర ఉన్నా, పనులకు సంబంధించిన బిల్లులు రూ.6వేల కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా కాళేశ్వరం పరిధిలోనే రూ.4,648 కోట్లు పెండింగ్‌లో ఉండగా, పాలమూరు–రంగారెడ్డిలో రూ.1,993 కోట్లు, డిండిలో రూ.298 కోట్లు, దేవాదులలో రూ.700 కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ కింద రూ.775 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మిషన్ కాకతీయకు సంబంధించినవే రూ.350 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బిల్లులకోసం ఏజెన్సీల ప్రతినిధులు, చిన్న కాంట్రాక్టర్లు నీటి పారుదల శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే చెల్లింపులు జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ బిల్లులు ఇప్పించాలంటూ మొర పెట్టుకుంటున్నారు. కిస్తీల చెల్లింపులకోసం ఒత్తిళ్లు పెరుగుతుండటం, బ్యాంకుల్లో కొత్త రుణాలు దొరక్కపోవడం, బయట వడ్డీలు పెరుగుతుండటంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల మేరకే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు బ్యాంకు గ్యారంటీలు సమర్పించి అగ్రిమెంట్లు చేసుకునేందుకు వెనకాడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై వేచి చూస్తున్నారు. -
కోడ్ బ్రేక్
జలమండలి పథకాలకు ఎన్నికల కోడ్ బ్రేకులు వేస్తోంది. రూకల్లోతు నష్టాల్లో ఉన్న జలమండలి రూ.878 కోట్ల నీటిబిల్లు బకాయిలు వసూలు చేసుకునేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో వన్‌టైమ్‌సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుమారు మూడు లక్షల మంది బకాయిదారులకు పెండింగ్ నీటిబిల్లులు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు గడువునిచ్చింది. ఆలోగా చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ ఈ పథకం ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందో? రాదో? అన్న సంశయంతో జలమండలి అధికారులు వారం క్రితం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకానిదీ ఇదే పరిస్థితి. గ్రేటర్ పరిధిలో సుమారు 1.50 లక్షల వరకు ఉన్న అక్రమ కుళాయిలను కూడా మార్చి 31 వరకు క్రమబద్ధీకరించుకునేందుకు స్వచ్ఛంద క్రమబద్ధీకరణ పథకం (వీడీఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకం కూడా కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న అనుమానంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. కానీ ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గోదావరి రుణానికీ చిక్కులు కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర జరుగుతున్న గోదావరి మంచినీటి పథకానికి హడ్కో సంస్థ రూ.వెయ్యి కోట్లు రుణ మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ రుణ మంజూరుకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) కోరింది. కానీ కోడ్ నేపథ్యంలో పూచీకత్తు ఇచ్చే విషయంలో ఆర్థికశాఖ అధికారులు కూడా సంశయంలో పడినట్లు విశ్వసనీయంగా తెలి సింది. దీంతో గోదావరి పథకానికి రుణ మంజూరు విషయం కూడా డైలమాలో పడినట్లు సమాచారం. నష్టాలు గట్టెక్కేదెలా..? బోర్డు నష్టాలను తగ్గించుకునేందుకు బకాయిల వసూలు మినహా ప్రత్యామ్నాయం లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. వన్‌టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టారు. నెలకు రూ.29 కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్న జలమండలికి సత్వరం బకాయిలు వసూలు చేసుకోని పక్షంలో నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో బోర్డు వర్గాలు తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం అనుమతి లభిస్తేనే ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపాయి.