The water problem
-
కాసుల కోసం కట్ట తెగ్గొట్టారు!
బరితెగించిన అధికార పార్టీ నేతలు కాంట్రాక్టు పనుల కోసం కట్టమంచి చెరువుకు గండి సహకరించిన కార్పొరేషన్ అధికారులు వేసవిలో చిత్తూరు నగరానికి నీటి సమస్య? ప్రజల ఆగ్రహం కరువు సీమలో చాలా ఏళ్ల తర్వాత కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. భూగర్భ జలాలూ పుష్కలమయ్యాయి. అయితే చెరువుల్లో పూడిక తీసేందుకు కాంట్రాక్టులు దక్కించుకున్న తెలుగుదేశం నాయకులు బరితెగించారు. డబ్బులు మంజూరైందే తడవుగా చెరువు కట్టలను తె గ్గొట్టారు. ముందూ వెనకా చూడకుండా నీటిని వృథాగా వదిలేస్తున్నారు. నాయకులు తమ జేబులు నింపుకోవడానికి ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చిత్తూరు (అర్బన్): ఇటీవల చిత్తూరు లో విస్తారంగా వర్షాలు కురవడంతో నగరంలోని కట్టమంచి చెరువు పూర్తిగా నిండింది. అయితే కట్టమంచి చెరువులో పూడిక తీసి బోటింగ్ ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆదేశించడంతో కార్పొరేషన్ అధికారులు, పాలకులు కలిసి చెరువు కట్టను తెగ్గొట్టి నీళ్లను మురుగునీటి కాలువలో బయటకు వదిలేశారు. చిత్తూరు నగరంలో అధికారపార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పేరుకు సీఎం సొంత జిల్లా అయినా... టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో చిత్తూరు నగరం అభివృద్ధికి దూరంగానే ఉంది. వేసవి వస్తోందంటే నగర వాసులకు కన్నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1.82 లక్షల జనాభా ఉన్న చిత్తూరు నగరానికి రోజుకు 22 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. కానీ కార్పొరేషన్ అధికారులకు ప్రజలకు ఇస్తున్నది సగటున 15 లక్షల లీటర్ల నీళ్లు మాత్రమే. అది కూడా 120 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న కార్పొరేషన్ యంత్రాంగం నెలకు రూ.44 లక్షలు కరువు నిధులను ట్యాంకర్లకు అద్దె రూపంలో చెల్లిస్తోంది. మిగిలిన 7 లక్షల లీటర్ల నీళ్లను ప్రజలు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఇంత నీటి ఎద్దడి ఉన్న చిత్తూరు నరంలో మూడు నెలల క్రితం విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు నిండాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. అప్పటి మేయర్ కటారి అనురాధ(టీడీపీ) కార్పొరేషన్ సాధారణ పద్దుల నుంచి నగరంలోని కట్టమంచి చెరువుపై కాసుల కోసం కట్టతెగ్గొట్టారు! 8 బోర్లు డ్రిల్ చేయడానికి ప్రతిపాదించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.20 లక్షల వ్యయంతో చెరువు కట్టపై బోర్లు వేసి ప్రజలకు నీళ్లందిస్తూ 60 అద్దె నీటి ట్యాంకర్లను తగ్గించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మేయర్ హత్యకు గురవడం తెలిసిందే. అయితే కట్టమంచి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని, నీరు-చెట్టు కింద పూడిక పనులు చేయించాల్సి ఉందని వెంటనే చెరువులో నీళ్లను ఖాళీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ (టీడీపీ) ఆర్డీవో, కార్పొరేషన్ అధికారులకు గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వేసవి కాలం, రూ.20 లక్షలతో వేసిన బోర్లు ఎందుకూ పనికిరాకుండాపోయి ప్రజలకు నీటి కష్టాలు వస్తాయనే విషయాలు అధికారులకు తెలిసినా ఎదురు చెప్పలేక కట్టమంచి చెరువును తెంపేశారు. ప్రస్తుతం ఇక్కడున్న నీళ్లన్నీ మురుగునీటి కాలువలో కలిసి వృథాగా పోతున్నాయి. దీనిపై అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి గండి కొట్టిన ప్రాంతాన్ని పూడ్చేస్తే, పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ అధికారులు మళ్లీ చెరువుకు గండి కొట్టి నీళ్లను బయటకు పంపేస్తున్నారు. ప్రతీ వ్యక్తి ఇంకుడు గుంతలు తవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు ఊదరగొడుతుంటే సొంతలాభం కోసం అదేపార్టీకి చెందిన నాయకులు ఇలాంటి పనులు చేయడంపై చిత్తూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తీరని దాహం
చిత్తూరులోని కట్టమంచి ప్రాంతంలో తాగునీటి కోసం క్యూలో వేచి ఉన్న జనం జిల్లాలో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. 2012 నాటికి కేవలం 406 గ్రామాలలో నీటిసమస్య ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఆరింతలు పెరిగింది. పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ప్రస్తుతం 2724 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం నెలకు ’ 7.3 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. ప్రయివేటు నీటి వ్యాపారం ’ కోట్లలో సాగుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. - ఏటా తీవ్రమవుతున్న సమస్య - ఏప్రిల్ నాటికి 2724 గ్రామాలకు నీటి సరఫరా - నెలకు * 7.3 కోట్లు ప్రభుత్వ ఖర్చు - ప్రయివేటు నీటి కొనుగోలు *కోట్లలో... సాక్షి,చిత్తూరు: జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండగా, ఈ ఏడాది తిరుపతి డివిజన్ పరిధిలో సైతం తాగునీటి ఎద్దడి తలెత్తింది. మూడేళ్ల గణాంకాలను చూస్తే ఏడాదికేడాది నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ఈ ఏడాది వేలాది గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. 2012 ఏప్రిల్ నెలలో చిత్తూరు డివిజన్లో 177 గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014లో 261 గ్రామాలకు, 2015లో ఏకంగా 1,081 గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చింది. మదనపల్లె డివిజన్లో 2012 ఏప్రిల్‌లో వంద గ్రామాలకు, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014 ఏప్రిల్‌లో 261 గ్రామాలకు,2015 లో 922 గ్రామాలకు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తిరుపతి డివిజన్లో 2012 ఏప్రిల్‌లో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో మూడు గ్రామాలకు, 2014లో ఒక్కగ్రామానికి కూడా నీటిసరఫరా చేయలేదు. 2015లో మాత్రం ఏకంగా వంద గ్రామాలకు ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ప్రాజెక్టులు పూర్తయితేనే... జిల్లా నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా, కండలేరు నీటి పథకాన్ని పూర్తిచేయడం మినహా మరో మార్గం లేదు. హంద్రీనీవా పూర్తి కావాలంటే రూ.1100 కోట్లు అవసరం. బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.200 కోట్లు. చిత్తూరు జిల్లాకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే కండలేరు తాగునీటి పథకాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం లో ఆ పథకం రూపుదిద్దుకుందన్న అక్కసుతోనే బాబు ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. చిత్తశుద్ధితో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసి తాగునీటి సమస్యను శాశ్వ తంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.