wedding in air
-
భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో...
బెర్లిన్ : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. తూర్పు జర్మనీకి చెందిన నికోల్ బెకాస్, జెన్స్ నార్లు ఆ కోవకు చెందినవాళ్లే. అందుకే తమ వివాహాన్ని వెరైటీగా ఫ్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా.. టైట్రోప్ ఆర్టిస్ట్‌ను సంప్రదించి తమ ఆలోచనను పంచుకున్నారు. అతడి సాయం, ఆలోచనతో భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో ఒక్కటయ్యారు. ఓ తాడుపై టైట్రోప్ ఆర్టిస్ట్ మోటార్ సైకిల్ నడుపుతుంటే.. దానికి కట్టిన తాడుకు కింద ఓ ఊయల కట్టారు. అందులో కూర్చున్న వాళ్లు ఉంగరాలు మార్చుకున్నారు. భూమి- ఆకాశాల మధ్య వివాహ బంధంతో ఒక్కటై అందరి దృష్టిని ఆకర్షించారు. విశేషమేమిటంటే పాస్టర్ కూడా నిచ్చెన సాయంతో గాల్లో నిలబడి వీరితో పెళ్లి ప్రమాణాలు చేయించారు. ఇలా తమకు నచ్చిన రీతిలో పెళ్లి చేసుకున్న నికోల్ బెకాస్, జెన్స్ నార్లు...ఆ మధుర ఙ్ఞాపకాలను ‘లైఫ్ ఆల్బం’లో పొందుపరచుకున్నారు. 3 వేల మంది ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. -
గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి
ముంబయి: పెద్దలు కుదిర్చిన వివాహాన్నే నలుగురు మెచ్చుకునేలా చేసుకోవాలని అనుకుంటారు. అదే ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కూడా తోడైతే ఆ ప్రేమికుల ఆలోచనలకు హద్దుంటుందా.. వారి పెళ్లి చేసుకునే విధానం గురించి కనే కలలకు లెక్కంటూ ఉంటుందా.. గాల్లో తేలే ఆనందంతో ఎగిరి గంతేయరూ. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రేమ జంట గాల్లోకి ఎగిరి గంతేయడమే కాదు.. అదే గాల్లోనే ఉండి ఏకంగా దండలు మార్చేసుకున్నారు. అది కూడా దాదాపు 90 మీటర్ల ఎత్తుల్లో గాల్లో వేలాడుతూ. మహారాష్ట్రలోని కోలాపూర్ కు చెందిన జెహదీర్, రేష్మా అనే ఇద్దరికి ట్రెక్కింగ్ అంటే ఎంతో పిచ్చి. అలా ట్రెక్కింగ్ కు వెళ్లే క్రమంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. అదే ప్రేమను గాల్లోకి తీసుకెళ్లారు. పెద్దలను పెళ్లికి ఒప్పించి ఓ రోప్ వే ద్వారా 90 మీటర్ల ఎత్తులో వేలడుతూ దండలు మార్చుకున్నారు. తన ప్రియురాలి కోరిక మేరకు అతడు ఇలా ప్లాన్ చేశాడంట.