అంకెల్లో హైదరాబాద్
గ్రేటర్ పరిధిలో సగటు వేతన జీవులకు వీకెండ్ వినోదం భారంగా పరిణమిస్తోంది. అరకొర వేతనాలతో సతమతమవుతున్న సిటీజనులు శని, ఆదివారాల్లో విందు, వినోదాలకు చేసే ఖర్చు ఇంటి బడ్జెట్ను తారుమారు చేస్తోంది. ఇద్దరు పిల్లలతో భార్య, భర్త కలిసి వారాంతంలో సినిమాకి వెళ్తే రూ. 500 ఖర్చవుతుంది. బయటే డిన్నర్ కూడా కానిస్తే రూ. 1,500 నుంచి రూ. 2,000 పెట్టాల్సిందే. ఈ లెక్కన నెలకు రూ. 10,000 వరకు జేబుకు చిల్లు పడాల్సిందే..
బడ్జెట్ గురించి పేపర్లన్నీ తిరగేశారా? అంకెలూ, లెక్కలూ, టేబుల్సూ, రంగురంగుల రింగులూ, రూపాయి రాకడా పోకడా అంతా గందరగోళంగా ఉందా? మీకే కాదు పేపర్లో రాసేవాళ్లకి కూడా సగం అంతుపట్టదు. కాస్త అర్థమయ్యేలా ఓ కథ ఉంది. చిత్రకారుడు చంద్ర ఎప్పుడో రాశాడు. కథ పేరు ‘‘బడ్జెట్.’’