west bengal tour
-
మోదీతో దీదీ భేటీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు అనంతరం మీడియాకు చెప్పారు. రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాలంటూ మమత రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం, అంతేగాక జాతీయ ఉపాధి హామీ కూలీలకు మమత సర్కారే చెల్లింపులు చేయడం తెలిసిందే. -
ఏడు వింతలే అని ఎవరు చెప్పారు? ఇది ఎనిమిదో వింత!
Kolkata Eco Park: ఈఫిల్ టవర్ చూడాలంటే... యూరప్ ట్రిప్ అక్కర్లేదిప్పుడు. వెస్ట్‌బెంగాల్ టూర్ చాలు. కోల్‌కతా నగరం... పారిస్ ఈఫిల్ టవర్‌కు ఏ మాత్రం తీసిపోని ప్రతిరూపాన్ని నిర్మించింది. విస్తారమైన పార్కింగ్ లాట్‌తో చాలా ముందుచూపుతో నిర్మించిన టూరిస్ట్ ప్రదేశం ఇది. ఎంట్రీ టికెట్ కేవలం ముప్పై రూపాయలు. పచ్చటి లాన్లలో చేతులు పట్టుకుని విహరించే పర్యాటక ప్రేమికులు, సరస్సులో బోట్ షికారు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లలు, పిల్లగాలికి మెల్లగా కదిలే తేలికపాటి అలలను ఆస్వాదించడానికి ఒడ్డున బెంచీల మీద సీనియర్ సిటిజెన్, సైకిల్ తీసుకుని ఆవరణ అంతా తిరిగి చూస్తున్న యూత్, మూడు ఎంట్రీ గేట్లు... ఈ దృశ్యమే ఈ పార్క్ మనం అనుకున్నంతకంటే ఇంకా చాలా పెద్దది కావచ్చేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ టవర్ వ్యూ పాయింట్ నుంచి దాదాపుగా కోల్‌కతా నగరమంతటినీ చూడవచ్చు. రోమన్ కలోజియం నమూనా ఏడు వింతల ప్రతిరూపం ఈ ఎకో పార్క్ ఈఫిల్ టవర్ ప్రతిరూపంతో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతోపాటు ప్రపంచంలోని ఏడు వింతల కట్టడాలకూ ప్రతిరూపాలున్నాయి. లండన్ బిగ్‌బెన్ టవర్, జపాన్ గార్డెన్, బెంగాలీ గ్రామం, హెర్బల్ గార్డెన్లతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం ఆనందమయమైన విహారానికి అధునాతనమైన వేదిక. మరో సంగతి! కోల్‌కతా ఈఫిల్ టవర్ గురించి తెలిసిన వెంటనే మనకు ఇండియాలో ఈఫిల్ టవర్ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది. కానీ ఇంతకంటే ముందు మనదేశంలో ఈఫిల్ టవర్‌కు మరో రెండు ప్రతిరూపాలున్నాయి. చండీగఢ్‌లో పన్నెండు మీటర్ల ఎత్తులో ఒకటి ఉంది. రాజస్థాన్ రాష్ట్రం కోట నగరంలో ఒకటి ఉంది. అయితే వీటన్నింటిలోకి కోల్‌కతాలోని ఈఫిల్ టవర్ ప్రతిరూపం మాత్రమే పారిస్‌లోని అసలు ఈఫిల్ టవర్‌ను అచ్చంగా మూసపోసినట్లు ఉంటుంది. ఎకోపార్కులోని ఈజిప్టు గిజా పిరమిడ్ నమూనా ఈఫిల్ టవర్ ప్రతిరూపం తోపాటు ఈ వింతలన్నీ కోల్‌కతాలోని ఎకో పార్కులో ఉన్నాయి. ఇక్కడి ఈఫిల్ టవర్ పద్దెనిమిది అంతస్థుల నిర్మాణం, ఎత్తు 55 మీటర్లు (పారిస్ టవర్ ఎత్తు 324 మీటర్లు). 2015లో మొదలు పెట్టి నాలుగేళ్లలో పూర్తి చేశారు. ఈ పార్కు 2020లో పర్యాటక ద్వారాలు తెరుచుకుంది . ∙ఎకోపార్కులోని తాజ్‌మహల్ నమూనా (పై ఫొటో) క్రైస్ట్ రిడీమర్ విగ్రహం దగ్గర టూరిస్ట్ -
యోగి హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ
బలూర్ఘాట్/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పశ్చిమబెంగాల్లో చుక్కెదురైంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆదివారం బీజేపీ చేపట్టిన రెండు సభలకు సీఎం యోగి హాజరు కాలేకపోయారు. అందుకు బదులుగా ఫోన్ ద్వారా ఆయన రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో సత్తా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ‘గణతంత్ర బచావో’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బలూర్ఘాట్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్గంజ్లో నిర్వహించే సభలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆదిత్యనాథ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఈ రెండు చోట్లా మమతా బెనర్జీ రాష్ట్ర యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన లక్నో నుంచే ఫోన్ ద్వారా ఈ రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
‘టీం ఇండియా’తోనే అభివృద్ధి!
- ప్రధాని నరేంద్ర మోదీ ‘సమాఖ్య’ మంత్రం - కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేయాలి - ప్రధాని, ముఖ్యమంత్రులు ఒక జట్టుగా ఉండాలి - దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం, బేలూరు మఠాల సందర్శన బర్న్‌పూర్(పశ్చిమబెంగాల్): కేంద్రం-రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పురోగమిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ‘టీం ఇండియా’ మాదిరి పనిచేయాలన్నారు. అప్పుడే అభివృద్ధితోపాటు ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.. ఆదివారం ఆయన పశ్చిమబెంగాల్లోని బర్న్పూర్లో ఆధునీకరించిన ఐఐఎస్‌సీఓ స్టీల్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ‘గతంలో కేంద్రం, రాష్ట్రా లకు మధ్య అంత సఖ్యత ఉండకపోవడం దురదృష్టకరం. నేనూ చాలా ఏళ్లపాటు సీఎంగా పనిచేశా. కేంద్రం-రాష్ట్రాల సంబంధాలు ఎప్పుడూ అంత బాగుండేవి కాదు. అందరినీ కలుపుకొని పోలేని రీతిలో కేంద్రం వైఖరి ఉంటే దాంతో రాష్ట్రాలకు ఒరిగేదేమీ ఉండదు. కానీ మేం అధికారం చేపట్టాక సమాఖ్య వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారు. ప్రధాని, సీఎంలు టీం ఇండియాలా పనిచేయాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్రం మాత్రమే ఈ దేశాన్ని పాలించదు. కానీ దురదృష్టవశాత్తూ గత 60 ఏళ్లలో ఇదే జరిగింది. ఒక్క ఢిల్లీ అనే పునాదిపైనే ఈ దేశం నిలబడదు. దానికి మరో 30(రాష్ట్రాలు) పునాదులు సాయంగా నిలవాలి’ అని అన్నారు. అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పాటైన నీతి ఆయోగ్‌ను సమాఖ్య స్ఫూర్తికి ఉదాహరణగా చూపారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో కుదిరిన సరిహద్దు ఒప్పందం టీం ఇండియా సాధించిన విజయమన్నారు. 41 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు బెంగాల్, అస్సాం, త్రిపురలతో కలసి కేంద్రం ఒక శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. అందరూ కలసి పనిచేస్తే అంతర్గత సమస్యలతోపాటు అంతర్జాతీయ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. బెంగాల్ శక్తే.. దేశానికి శక్తి! గతంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమబెంగాల్ చుక్కానీగా నిలిచిందని ప్రధాని అన్నారు. ఈశాన్య భారతాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందుకు ముందుగా బెంగాల్‌ను మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. ‘గతంలో దేశ ఆర్థిక పురోగతి బెంగాల్‌పైనే ఆధారపడి ఉండేది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు బెంగాల్ అభివృద్ధి నిచ్చెన ఎక్కాలి. మళ్లీ పూర్వవైభవం రావాలి. బెంగాల్ శక్తిమంతం కాకుండా దేశంలో ఇతర ప్రాంతాలు కూడా శక్తిమంతం కాలేవు’ అని అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా.. అవి అభివృద్ధికి అవరోధంగా నిలవొద్దన్నారు. యూపీఏ హయాంలో మీడియాలో బొగ్గు స్కాం వార్తలే ఉండేవని, ఇప్పుడు మాత్రం బొగ్గు వేలం వార్తలు ఉంటున్నాయన్నారు. తాము అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్నా ఒక్క స్కాం మచ్చ లేదన్నారు. ఈశాన్యం నుంచే రెండో హరిత విప్లవం దేశంలో రెండో హరిత విప్లవానికి ఈశాన్య రాష్ట్రాలే నాయకత్వం వహించాలని ప్రధాని అన్నారు. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ‘దేశానికి తిండి పెట్టాలంటే రెండో హరిత విప్లవం రావాలి. ఇది ఈశాన్య రాష్ట్రాల నుంచే ప్రారంభం కావాలి. పశ్చిమ భారతంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు సాగుతుంటాయి. కానీ ఈశాన్యం మాత్రం కాస్త స్తబ్ధుగా ఉంటుంది. ఇలా ఒక ప్రాంతం అనారోగ్యంతో ఉంటే దేశం ముందుకు వెళ్లదు. ఈ పరిస్థితిని మార్చాల్సి ఉంది’ అని అన్నారు. అంతకుముందు మమత మాట్లాడుతూ.. కలసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని, లేదంటే కుప్పకూలుతుందన్నారు. ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌ను రూ.16 వేల కోట్లతో ఆధునీకరించారు. దక్షిణేశ్వర్లో కాళీమాతకు పూజలు కోల్‌కతా సమీపంలోని దక్షిణేశ్వర్ ఆలయం, బేలూర్ మఠాన్ని ప్రధాని సందర్శించారు. ఆదివారం ఉదయం 7.55 గంటలకే దక్షిణేశ్వర్ ఆలయానికి చేరుకున్నారు. రామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళీమాత అమ్మవారికి పూజలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు శక్తి ప్రసాదించాల్సిందిగా కోరారు. తర్వాత రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రమైన బేలూరు మఠానికి వెళ్లారు. మఠంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. స్వామి వివేకానంద తన చివరి రోజుల్లో గడిపిన గదికి వెళ్లారు. స్వామి పాదరక్షల చెంత 15 నిమిషాలపాటు ధ్యానం చేశారు. సందర్శకులకు అద్దాల ద్వారా ఈ గదిని చూసేందుకు అనుమతిస్తారు. ప్రధానికి మాత్రం ప్రత్యేకంగా తలుపులు తెరిచి లోపలికి అనుమతించారు.‘పిల్లాడు తన ఇంటికి వస్తే ఎవరైనా స్వాగతం పలుకుతారా’ అంటూ సన్యాసులతో వ్యాఖ్యానించి మఠాన్ని తన సొంతిల్లుగా అభివర్ణించారు. సన్యాసులతో కలసి ఫొటో దిగారు. ఈ పర్యటనల తర్వాత మోదీ ఢిల్లీ వెళ్లారు. మోదీ బాల్యంలో సన్యాసం స్వీకరించేందుకు ప్రయత్నించారు. రెండేళ్లపాటు హిమాలయాల్లో గడిపి ఇంటికొచ్చారు. స్వామి ఆత్మస్థానంద (ప్రస్తుత రామకృష్ణ మఠం అధ్యక్షుడు) వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. -
పశ్చిమబెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న రాష్ట్రపతి
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లడానికి బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పై-లీన్ తుఫాను నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. బెంగాల్‌కు పొరుగు రాష్ట్రమైన ఒడిషాను తుఫాను తీవ్రంగా తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరాటీ సమీపంలోని కిర్నహార్ గ్రామం నుంచి సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ రోడ్డుమార్గంలో బయల్దేరుతారని అధికారవర్గాలు తెలిపాయి. కారులో ఆయన పానాగఢ్ చేరుకుని, అక్కడింనుంచి విమానమార్గంలో న్యూఢిల్లీ వెళ్తారు. వాస్తవానికి దుర్గాపూజ కోసం తన పూర్వీకుల గ్రామానికి రాష్ట్రపతి చేరుకున్నారు. ప్రణబ్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత దుర్గాపూజకు రావడం ఇది రెండోసారి.