west godhavari
-
వైఎస్సార్సీపీ నేతపై చింతమనేని దాష్టీకం
సాక్షి, దెందులూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దాష్టీకానికి దిగారు. పోలవరం కాలువపై జరుగుతున్న మట్టి రవాణాపై ఫిర్యాదు చేశాడనే అక్కసుతో.. వైఎస్సార్సీపీ నేత మేడికొండ కృష్ణపై హత్యాయత్నం చేశారు. కృష్ణను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి తీసుకెళ్తూ...కారులోనే తీవ్రంగా కొట్టారు. అనంతరం కృష్ణను రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంతటి దారుణానికి పాల్పడి కూడా.. కృష్ణపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెదవేగి పోలీసు స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చింతమనేని, టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గార్లమడుగు మాజీ సర్పంచ్ అయిన మేడికొండ కృష్ణ లక్ష్మీపురం వద్ద పోలవరం కాలువపై మట్టి అక్రమ తవ్వకాలపై ఇటీవల అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన చింతమనేని అనుచరులు రెండు కార్లలో వచ్చి ఆయనపై దాడికి దిగారు. అనంతరం అదే కారులో దుగ్గిరాలలోని ఎమ్మెల్యె చింతమనేని ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ నుంచి కొట్టుకుంటూ కారులో ఊరంతా తిప్పారు. అనంతరం రోడ్డుపక్కన కృష్ణను విసిరేశారు. కృష్ణ రక్తమోడుతున్న శరీరంతోనే పెదవేగి పోలీసులకు ఈ దుర్మార్గంపై ఫిర్యాదు చేశారు. కృష్ణకు మద్దతుగా దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, పార్టీ శ్రేణులు పెదవేగి పోలీసు స్టేషన్‌కి చేరుకొని ఆందోళనకు దిగారు. కృష్ణపై దాడి ఘటనలో ఎమ్మెల్యే చింతమనేనితోపాటు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలంటూ వారు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ వైఎస్సార్ సీపీ ఆందోళనతో పెదవేగి పోలీసులు ఎట్టకేలకు నేత ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. 248/18గా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 363, 323,324, 379 రెడ్ విత్ 34గా కేసు నమోదు చేశారు. ఎ2 గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎ1 గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిషోర్, ఎ3గా ఎమ్మెల్యే గన్మెన్లను పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నా విరమించారు. -
వైఎస్సార్సీపీ నేతపై చింతమనేని దాష్టీకం
-
చంద్రబాబుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా.. ఏలూరు మండలం వెంకటాపురం - మాదేపల్లి మధ్యలో నిర్మిస్తున్న 2000 కిలోమీటర్ల పైలాన్ పనులను శుక్రవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వినర్ కోటగిరి శ్రీధర్, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్పార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కోసం జిల్లాలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాలను గెలుచుకొని ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. పశ్చిమలోని అన్ని స్థానాలను కైవసం చేసుకొని టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజా ధనాన్ని లూఠీ చేసే పనిలో పడ్డారు. ఈసారీ చంద్రబాబుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని అన్నారు. ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. వైఎస్ జగన్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. 14న ఏలూరు మండలం వెంకటాపురం వద్ద 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను జగన్ ఆవిష్కరిస్తారు. అదే రోజు సాయంత్రం ఆయన ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. -
దేవుడు భుములు కబ్జా!
-
ఎమ్మెల్యే వెలగపూడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు
-
ఇక 'హంగుల'వాడీలు
► ప్రీస్కూల్స్‌గా మారనున్న పట్టణ అంగన్వాడీ కేంద్రాలు ► నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన ► ప్రత్యేక సిలబస్, ఇంగ్లిష్ బోధన, యూనిఫామ్ పంపిణీ జంగారెడ్డిగూడెం : పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై కార్పొరేట్ పాఠశాలలను తలపించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కార్పొరేట్ విద్య అందనుంది. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను కుదించి దగ్గరగా ఉన్న కేంద్రాలను ఒక ప్రీస్కూల్‌గా రూపొందించి చిన్నారులకు విద్యను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో చిన్నారులకు అత్యుత్తమ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రైవేట్‌కు దీటుగా.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రీ స్కూల్స్ రూపొందనున్నాయి. వీటిలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తారు. కార్పొరేట్ తరహాలో సూక్ష్మ ప్రణాళిక పద్ధతిలో చిన్నారులకు విద్యాబోధన చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. చిన్నారు ప్రీస్కూల్‌కు రాగానే అసెంబ్లీ నిర్వహించి.. అనంతరం విద్యాబోధన ప్రారంభిస్తారు. రోజువారీ ప్రణాళికలో భాగంగా అక్షరాలు ఏవిధంగా రాయా లి, ఏవిధంగా చదవాలి, తెలుగు పద్యాలు, గేయాలు పలక మీద రాయడం వంటివి చిన్నారులకు నేర్పిస్తారు. ఇం గ్లిష్ అక్షరాలను కూడా నర్సరీ స్థాయి నుంచే బోధిస్తారు. ఇంగ్లిష్ పదాలు, గేయాలు నేర్పుతారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్రీ స్కూల్లో ప్రత్యేక సిలబస్ రూపొందించారు. ఇందులో తెలుగుతోపాటు గణితం, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ కూడా బోధిస్తారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను బట్టి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోనే.. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలోనే ప్రీస్కూల్స్ నడుస్తాయి. జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో మొత్తం 381 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో 110, కొవ్వూరులో 55, పాలకొల్లులో 25, తణుకులో 36, నిడదవోలులో 16, భీమవరంలో 31, జంగారెడ్డిగూడెంలో 28, తాడేపల్లిగూడెంలో 60, నరసాపురంలో 20 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణం యూనిట్‌గా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను కలిపి ప్రీస్కూల్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు జంగారెడ్డిగూడెంలో మొత్తం 28 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిని 19 ప్రీ స్కూల్స్‌గా మారుస్తున్నారు. వీటికోసం త్వరలో భవనాలు నిర్మిస్తారు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన చేస్తారు. ఆకర్షణీయంగా.. ప్రీస్కూల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పాఠశాల భవనం వెలుపల భాగంతోపాటు లోపలి గదుల్లోనూ చిన్నారులను ఆకట్టుకునేలా చిత్రాలు ఉంటాయి. బ్లాక్‌బోర్డు చుట్టూ గోడలపై చిన్నారులకు బోధించే విధంగా పలు చిత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రీస్కూల్లో చదువుకునే చిన్నారులకు ప్రత్యేకంగా యూనిఫామ్ కూడా ఉచితంగా అందిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరుగా యూనిఫామ్ అందజేస్తారు. కార్యకర్తలకు శిక్షణ ప్రీస్కూల్స్ నిర్వహణపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శిక్షణ పూర్తికాగా.. మిగిలిన పట్టాణాల్లో వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు టి.హరితను కన్సల్టెంట్‌గా నియమించారు. -
తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
అత్తిలిలో పవన్ ఫ్లెక్సి వివాదం
-
మీ రాక కోసం
-
రోడ్డు ప్రమాదంలో..ఏడుగురికి తీవ్రగాయాలు
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటోను వంగూరు క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని జీపు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పంగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులు లింగపాలెం మండలం సింగగూడెం గ్రామానికి చెందిన వారు. వీరంతా ఏలూరులో జరిగే వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.