Westindies-india
-
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో మూడు టీ20 ల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లను వీక్షించవచ్చు అని భావించిన ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేనుట్లు తెలుస్తోంది. మేము ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేము. అహ్మదాబాద్‌లో వన్డే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టీ20లకు కూడా వర్తింపజేయాలి అని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. మరో వైపు విండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు ఆటగాళ్లతో పాటు నాలుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక విండీస్- భారత్ తొలి వన్డే అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న జరగనుంది. చదవండి: 5 వికెట్లతో చెలరేగాడు.. జట్టును గెలిపించాడు -
"టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం"
స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి టీమిండియా పర్యటనకు వెస్టిండీస్ బయలు దేరింది. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకోనుంది. అనంతరం అహ్మదాబాద్‌లో 3 రోజుల పాటు క్వారంటైన్లో విండీస్ జట్టు గడపనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమిండియాను ఓడించిడం అంత సులువు కాదని, అయితే ప్రస్తుత కరీబియన్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉందని హోల్డర్ తెలిపాడు. "టీమిండియాతో సిరీస్ అతి పెద్ద సిరీస్‌గా భావిస్తున్నాను. ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెట్ జట్టు. వాళ్ల గడ్డపై వారిని ఓడించడం అంత సులభం కాదు. గత రెండేళ్లుగా టీమిండియా స్వదేశంలో అధ్బుతంగా రాణిస్తుంది. కానీ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉంది. గత ఏడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత మా జట్టు నిరాశకు గురైంది. ఇంగ్లండ్‌పై మా జట్టు బౌన్స్‌బ్యాక్ చేసి అద్భుతమైన విజయం సాధించింది. అదే విధంగా మా డ్రెసింగ్ రూమ్‌లో కూడా ఏటువంటి విభేదాలు లేవు" అని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: Rashid Khan: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన రషీద్ ఖాన్.. అదరగొట్టేశాడుగా! -
విండీస్‌పై రహానే శతకం..
► హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ ట్రినిడాడ్: భారత్- వెస్టిండీస్ రెండో వన్డేలో టీంఇండియా ఓపెనర్ అజింక్యా రహానే శతకం సాధించాడు. గత కొద్ది రోజులుగా నిలకడలేమి ఆటతో సతమతవుతున్న రహానే ఎట్టకేలకు శతకం బాది తన సత్తా చాటాడు. గత చాంపియన్స్ ట్రోఫీలో రహానే నిలకడలేమి ఆటతో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రహానే అర్ధశతకం సాధించాడు. కానీ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు మంచి శుభారంబాన్ని అందించారు. వీరి దూకుడుకు భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ తరుణంలో 49 బంతుల్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో ధావన్(63) అష్లే నర్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రహానే 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత మరింత దూకుడు పెంచిన రహానే 102 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లతో కెరీర్లో మూడో శతకం సాధించాడు. అనంతరమే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ ఫినీషర్ హర్డీక్ పాండ్యా(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. మరో వైపు కెప్టెన్ కోహ్లీ(43), యువరాజ్ సింగ్(0) క్రీజులో ఉన్నారు. భారత్ 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.