White House talks
-
ట్రంప్‌పై ఆ పబ్లిషర్ మండిపాటు..
న్యూయార్క్ : మీడియా, పాత్రికేయులపై దాడి ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ టైమ్స్ పబ్లిషర్ ఏజీ సబెర్గర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడి మీడియా వ్యతిరేక వైఖరి సరైంది కాదని, ఇది వైరుధ్యాలను పెంచడంతో పాటు దేశానికి ప్రమాదకరమని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల వైట్‌హోస్‌లో భేటీ సందర్భంగా తాను ఆయనతో ఈ అంశాలపై చర్చించానని న్యూయార్క్ టైమ్స్ ప్రచురణకర్త ఓ ప్రకటనలో వెల్లడించారు. తమ ప్రైవేట్ భేటీ వివరాలను ట్రంప్ తన ట్విటర్ ఫాలోవర్లకు వెల్లడించడంతో దీనిపై తాను బహిరంగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జులై 20న జరగిన ఈ భేటీని బహిర్గతం చేయవద్దని ట్రంప్ సహచరులు తనను కోరారన్నారు. కాగా సబెర్గర్‌తో సమావేశం ఆసక్తికరంగా సాగిందని, మీడియాలో వెల్లువెత్తుతున్న ఫేక్ న్యూస్‌పై విస్తృతంగా చర్చించామని ట్రంప్ ట్వీట్ చేశారు. మీడియాపై విరుచుకుపడుతూ ట్వీట్ల పరంపర సాగించారు. మీడియాపై ట్రంప్ ఎదురుదాడి, ఆయన అనుసరిస్తున్న మీడియా వ్యతిరేక వైఖరి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడితో భేటీకి తాను అంగీకరించానని న్యూయార్క్ టైమ్స్ పబ్లిషర్ చెప్పుకొచ్చారు. ఫేక్‌న్యూస్ అవాస్తవమని తాను ట్రంప్‌తో స్పష్టం చేయడంతో పాటు జర్నలిస్టులను ప్రజల శత్రువులుగా ఆయన ముద్రవేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు జర్నలిస్టులపై దాడులకు ప్రేరేపిస్తాయని, హింసకు దారితీస్తాయని ట్రంప్‌కు తెలిపానని వెల్లడించారు. -
ట్రంప్‌తో తొలి డిన్నర్ మన ప్రధానిదే
వాషింగ్టన్: ప్రధాని నరేంద్రమోదీ మరో ఖ్యాతిని గడించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి డిన్నర్ చేయనున్నారు. ఇలా ట్రంప్‌తో డిన్నర్ చేయనున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ పేరు గడించనున్నారు. దాదాపు ఐదు గంటలపాటు ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ అవనున్నారు. ఒక నేతతో ఇంత పెద్ద మొత్తం సమయం భేటీ అవడం కూడా ట్రంప్‌కు ఇదే తొలిసారి. ఈ ఐదుగంటలు కూడా ఎంతో సానుకూలంగా, స్నేహభావంతో ఉంటాయని, ఒకే కుటుంబాన్ని తలపిస్తాయని వైట్‌హౌస్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దౌత్యపరమైన విషయాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చ జరగనుంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత 3.30గంటల ప్రాంతంలో వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. అందులో భాగంగా కొద్ది సేపు మీడియా ముందు ఫొటో సెషన్, తర్వాత ఇరు దేశాల సంబంధాలపై ట్రంప్, మోదీ మధ్య చర్చలు అనంతరం కాక్టెయిల్ రిసెప్షన్ ఉంటుంది. ఈ సమావేశం తమ శ్వేత సౌదం చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తోందని, రెడ్ కార్పెట్‌తో స్వాగతం సిద్ధం చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయల్దేరారు. తొలుత పోర్చుగల్‌లో పర్యటించనున్నారు. అనంతరం అమెరికాలో రెండు రోజులు పర్యటించి ట్రంప్‌తోపాటు వివిధ సంస్థల సీఈవోలతో భేటీ అవనున్నారు. ఆ తర్వాత నెదర్లాండ్ పర్యటనకు వెళతారు.