wife serious
-
భార్య, అత్తలపై హత్యాయత్నం.. అత్త మృతి
(వెంకటపతి, సాక్షి భీమవరం) పశ్చిమగోదావరి జిల్లా మెంటేవారి తోటలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ సంఘటనలో, కత్తి తీసుకుని భార్య, అత్తలపై అతడు దాడి చేశారు. ఈ సంఘటనలో అత్త అక్కడికక్కడే మరణించగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటేవారి తోటకు చెందిన షేక్ సుబానీకి, మీరాబీ అనే మహిళతో గతంలో వివాహమైంది. కొంతకాలం బాగానే ఉన్న తర్వాత అతడు ఈమెను వదిలిపెట్టి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె ఇతడిని వదిలేయడంతో మళ్లీ భార్య దగ్గరకు వచ్చాడు. కానీ ఇన్నాళ్లూ కాదని ఇప్పుడు ఎందుకు వస్తావంటూ మీరాబీ, ఆమె తల్లి మస్తానమ్మ అతగాడిని రానివ్వలేదు. దీనికితోడు వీళ్ల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి, గొడవపడేవాడు. ఇదే క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కూడా వీళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాంసం కొట్లో పనిచేసే సుబానీ.. అక్కడ మాంసం కోసే కత్తి తీసుకుని ముందుగా అత్తను నరికేశాడు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారి.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
భార్య పీక కోసి.. బావిలోకి తోసేశాడు!
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. నిండు నూరేళ్లు కష్టసుఖాల్లో చేయి వీడనంటూ అగ్నిసాక్షిగా బాసలు చేసి భర్తే.. పెళ్లయిన రెండు వారాలకే కట్టుకున్న భార్య పీక కోసేశాడు. అంతేకాదు, ఆమెను బావిలోకి తోసేసి.. బండరాళ్లు కూడా విసిరాడు. సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్న అరసవిల్లిలో ఈ ఘాతుకం జరిగింది. అదనపు కట్నం కోసమే అతగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ''డిసెంబర్ 8న పెళ్లయింది. తన ఉద్యోగానికి తగిన కట్నం ఇవ్వలేదని వేధించారు. నిన్న రాత్రి శ్రీకాకుళంలో పాలు పొంగించాం. ఇరువైపులా బంధువులు అందరూ వచ్చారు. వచ్చాక, అందరూ భోజనం చేశారు. బంధువులంతా శ్రీకాకుళంలో వేరే బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యరాత్రి లేచి, బాత్రూంకి వెళ్లి, షేవింగ్ బ్లేడు పట్టుకుని మెడమీద పెట్టి కోసేశారు. నేను అరిచేసరికి అమ్మ, పిన్ని లేచారు. పిన్ని తలను గోడకేసి కొట్టారు. నేను పారిపోయాను. ఆ వీధిలో బావి ఉంది. అక్కడ కూర్చుని ఉంటే ఎత్తి బావిలో పారేసి, రెండుమూడు రాళ్లు విసిరేశారు. ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి నన్ను బయటకు తీశారు. మా భర్త కూడా అగ్నిమాపకశాఖలోనే పనిచేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మరో అమ్మాయి ఎవరికీ ఇలా జరగకూడదన్నదే నా ఆరాటం'' అని దివ్యశ్రీ తెలిపింది.