Wildlife Sanctuary
-
ESZ: మైనింగ్, పరిశ్రమలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అడవుల పరిరక్షణ కోసం మైనింగ్, పరిశ్రమల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు), చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. బఫర్ జోన్‌కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ జోన్ల వెంబడి జరుగుతున్న తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున.. చీఫ్ కన్జర్వేటర్ ESZ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి మూడు నెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది. -
Joginapally Santosh Kumar: ఎంపీ కెమెరాలో సింహం బందీ
సాక్షి, హైదరాబాద్: అడవికి రారాజుగా దర్పంతో విశ్రమిస్తున్న సింహాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై ఎంపీ జైరామ్ రమేశ్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం గుజరాత్‌లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. కమిటీ సభ్యుడిగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ పర్యటన వివరాలను ట్విట్టర్‌తో పాటు మీడియాతో పంచుకున్నారు. గిర్ సింహాలను దగ్గరిగా చూడటం తనను మంత్రముగ్ధుడిని చేసిందని, రోమాలు నిక్కబొడ్చుకున్నాయని ఆయన తెలిపారు. Could capture few once in a lifetime, photos of this lazy, relaxing #Lion, probably after a scrumptious meal 😊. Countless mesmerising moments, that gave all of us goosebumps in the wild, would definitely last long. Ufff.. this is like a trans and perplexing for me.#Photography pic.twitter.com/edek5EQHLN — Santosh Kumar J (@MPsantoshtrs) May 5, 2022 -
పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
బెంగాల్ పులులున్నాయ్.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్.. అలుగులు అలరారుతున్నాయ్.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది. బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్), 4 గిరి నాగులు (కింగ్ కోబ్రా) ఉన్నట్టు గణించారు. చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి జింకలు.. చుక్కల దుప్పులు ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. నేషనల్ విన్నర్ ‘ఆరంజ్ ఓకలీఫ్’ ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్ ఓకలీఫ్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్ ఓకలీఫ్ అభయారణ్యంలో అలుగులు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు. చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు -
కరోనా : హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తాం
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వన్యప్రాణులకు మాత్రం వరంగా మారింది. జన సంచారం, పశువులు, కాపరుల అలజడి లేకపోవడంతో వన్యప్రాణులు హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకొని తిరిగే మూగజీవాలు.. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో.. ఏ మాత్రం భయపడకుండా తిరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో పూర్తిగా మమేకమవుతున్నాయి. అటవీ అధికారులు సైతం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ ప్రాంతంలో, నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలో, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అభయారణ్యంలో వన్యప్రాణుల కదలికలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జన్నారం : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో నెల రోజులుగా అటవీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రధాన రహదారికి కూత వేటు దూరం అటవీ ప్రాంతానికి వెళ్తేనే.. లేడి పిల్లలు చెంగు చెంగున పరుగులు పెడుతున్నాయి. నీలుగాయిలు, మెకంలు, దుప్పులు, అడవి దున్నలు, సాంబర్లు ఇలా.. ఒక్కటేమిటి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కాసేపు సరదాగా ఆడుకుందాం అనే రీతిలో కనిపిస్తున్నాయి. వీటికి తోడు గ్రామాల్లో తిరిగే కొండముచ్చులు, కోతులు కూడా అడవిబాట పట్టాయి. దీంతో నిత్యం కోతులతో ఇబ్బందులు పడుతున్న జనానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. కాగా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాసర్ వెల్స్, కుంటలు, సోలార్ పంపుసెట్లు, ర్యాంపు వెల్స్, నీటి చెలిమెలు తవ్వారు. జన్నారం డివిజన్ పరిధిలో సుమారు 20 సోలార్ పంపుల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నారు. వాటి ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతున్నారు. కన్హా టైగర్ రిజర్వ్‌లో ఏర్పాటు చేసిన మాదిరిగా ప్రకృతి సిద్ధమైన నీటి చెలిమెలు తవ్వించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ పులి సంచారం ఎక్కువైంది. తాండూర్, నెన్నెల ప్రాంతాల పరిధిలో పులి సూర్యాస్తమయం కాకుండానే జనారణ్యంలోకి వస్తోంది. ఇక జన్నారం అటవీ రేంజ్‌లలో వివిధ రకాల పక్షులు దర్శనమిస్తున్నాయి. కొంగల విహారం కనువిందు చేస్తోంది. అరుదైన పక్షులు విజిలింగ్డక్స్, పేయింటెడ్ స్టోర్క్స్, బ్లాక్నెక్డ్, ఉలినెక్డ్ పక్షులు దర్శనమిస్తున్నాయి. ఈ పక్షులు దేశంలో అరుదుగా కనిపిస్తాయని అటవీ అధికారులు తెలిపారు. -
రోడ్లమీద సంచరించిన సింహాల గుంపు
-
వైరల్ : రోడ్లమీదకు వచ్చేసిన సింహాల గుంపు
జునాగఢ్ : గుజరాత్‌లోని జునాఘడ్ ప్రాంతంలో రోడ్లపై సింహాల గుంపు నిర్భయంగా తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి సమయంలో ఏడు సింహాలు జునాగఢ్ ప్రాంతంలో తిరుగుతున్న వీడియోనూ చూసి ఏ నిమిషం ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, జునాగఢ్‌కు సమీపంలో ఉన్న గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ సింహాల గుంపు వచ్చినట్లు తెలుస్తోంది. "గిర్నార్ అభయారణ్యం జునాగఢ్‌కు సమీపంలో ఉండడంతో సింహాలు తరచుగా బయటకు వస్తుంటాయి. ఇది ఇక్కడ సాధారణమైన విషయం. రాత్రి వేళలో ఇవి బయటకు వచ్చి రోడ్లమీద సంచరించి తిరిగి అడవికి వెళ్లిపోతాయి తప్ప ఎవరికి హాని కలిగించవు. అటవీశాఖ ప్రతీక్షణం సింహాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తుందని' డిప్యూటి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారి సునీల్ కుమార్ బెర్వాల్ వెల్లడించారు. గత నెలలో గిర్ అటవీ ప్రాంతంలో ఒక సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. సహజంగానే మాంసాహారులు అయిన సింహాలు ఇలా గడ్డి తినడం ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆ వీడియో చివర్లో అసలు విషయం బయటపడింది. సింహాలు ఎప్పుడైనా కడుపు నొప్పితో బాధ పడినప్పుడు గడ్డిని తిని అంతకుముందు తిన్న పదార్థాలను వ్యర్థ రూపంలో బయటకు పంపుతాయి. -
ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ : వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటి వ్యాలీని సందర్శించిన సందర్భంగా కొండపై నక్కి ఉన్న మంచు చిరుతను ఆయన తన కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను..‘ ఆర్ట్ ఆఫ్ కమోఫ్లాగ్’ (నిగూఢమైన)పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక ఈ ఫొటోలో దాగి ఉన్న చిరుతను పట్టుకునేందుకు నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ చాలా మంది దాని జాడను కనిపెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘ మ్యాన్.. ఈ ఫొటోను ఎప్పటి నుంచో తీక్షణంగా చూస్తున్నా. కానీ చిరుత దొరకడం లేదు. అది ఎక్కడుందో తెలుసునే దాకా నిద్ర పట్టేలా లేదు’ అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఏంటీ.. మీరు కూడా చిరుత కోసం వెదుకుతున్నారా. దొరకలేదా..? మరేం పర్లేదు.... మీ శ్రమను తగ్గించేందుకు.. మంచు చిరుతను ‘పట్టుకున్న’ ఓ నెటిజన్ షేర్ చేసిన ఫొటోను మీకోసం అందిస్తున్నాం. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ గ్రామంలో సౌరభ్ దేశాయి ఈ ఫొటోను తీశారు. ఘోస్ట్ ఆఫ్ మౌంటేన్‌గా పిలుచుకునే మంచు చిరుతలు భూమి నుంచి దాదాపు 9800 నుంచి 17 వేల అడుగుల ఎత్తున కనిపిస్తాయి. కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, కిన్నార్ జిల్లాలో ఇవి అప్పుడప్పుడూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. -
వన్యప్రాణుల నిలయం..కాబిని
పర్యాటక ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కొన్ని చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం హాయిని కొల్పితే, మరికొన్ని చోట్ల అందమైన పక్షులు, అబ్బుర పరిచే జంతువులు ఆసక్తికి కలిగిస్తాయి. ఇంకొన్ని చోట్ల ఎత్తై కొండల నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి సోయగాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఒకేచోట, అదీ మనకు అందుబాటు దూరంలో కొలువుదీరితే అంతకు మించిన పర్యాటక ప్రదేశం ఏముంటుంది చెప్పండి. అలాంటిదే కర్ణాటకలోని కాబిని అటవీ ప్రాంతం. రోజు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం..! వర్షపాతం.. కాబిని డ్యామ్ కోసం ఇక్కడ ఒక పెద్ద సరస్సును ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్న ఒక గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా ఆ గ్రామం పేరుతో ఆ సరస్సుకు 'మస్తగుడి సరస్సు' అని నామకరణం చేశారు. నాగర్ హూల్ అటవీ ప్రాంతాన్ని, బండిపుర అటవీ ప్రాంతాన్ని ఈ డ్యామ్ వేరుచేస్తోంది. ఇక్కడ పడే వర్షపాతంలో వైవిధ్యాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు చిన్నవిగాను, మరికొన్ని ప్రాంతాల్లో వృక్షాలు పెద్దవిగాను ఉంటాయి. ఏటా ఇక్కడ 1000 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది. ఆహ్లాదకర వాతావరణం.. అడవుల్లో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రుల్లో చలిమంటలు, స్థానిక గ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందొచ్చు. కాబిని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతోంది. కర్నాటకలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. జంతు వీక్షణం.. అడవిలో సఫారీపై వెళితే అనేక జంతువులను దగ్గర నుంచి చూడొచ్చు. కాబినిలో 300 రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏనుగుల సఫారి. సరస్సుల్లో బోట్ షికారు చేస్తూ అక్కడి మొసళ్లు, నీరు తాగే జింకలను చూసి ఆనందించొచ్చు. లెక్కకు మించిన జలపాతాలు.. ఈ ప్రాంతంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు పడుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి దగ్గరలోని నదిలో కలుస్తుంది. ఈ వాటర్‌ఫాల్స్ నీరు అంత ఎత్తు నుంచి కిందపడే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తున లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటాయి. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్టు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం, ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప అనుభూతిని మిగిల్చే సాహసం. ఎక్కడ ఉంది..? కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి చెందింది. ఇది నాగర్ హూలే అటవీ ప్రాంతంలోని భాగం. బెంగళూరుకు సుమారు 160 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్యాటక స్థలాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇది నాగర్హూల్ అటవీ ప్రాంతానికి ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం దట్టమైన అడవులు, సరస్సులు, ప్రవాహాలతో నిండి ఉంది.