wishes to telugu people
-
తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టతను సీఎం వివరించారు. 'మనవైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి.. రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక’ అని సీఎం జగన్ అన్నారు. ‘భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి' అని ఆయన ఆకాక్షించారు. (చదవండి: ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్) -
టాలీవుడ్ సెలబ్రిటీల చవితి శుభాకాంక్షలు
వినాయకచవితి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ ఇంట వేడుకలను షేర్ చేశారు. తొలిసారి పండుగ జరుపుకున్నట్లు హీరోయిన్ చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. స్వతహాగా పంజాబీ అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిలైపోవడంతో తెలుగు సంప్రదాయాలను కూడా చార్మీ పాటిస్తోంది. చిరంజీవి, రాంచరణ్ తదితరులు తమ ఇంట్లోనే గణపతి పూజ చేసుకుని.. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పూజలో దర్శకుడు వీవీ వినాయక్ కూడా పాల్గొన్నారు. షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఇంట్లో పండుగ సందడిని షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, దేవీ శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అల్లు శిరీష్ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.