టాలీవుడ్ సెలబ్రిటీల చవితి శుభాకాంక్షలు | tollywood celebrities wishes to telugu people on chavithi | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ సెలబ్రిటీల చవితి శుభాకాంక్షలు

Published Mon, Sep 5 2016 1:48 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

టాలీవుడ్ సెలబ్రిటీల చవితి శుభాకాంక్షలు - Sakshi

టాలీవుడ్ సెలబ్రిటీల చవితి శుభాకాంక్షలు

వినాయకచవితి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ ఇంట వేడుకలను షేర్ చేశారు. తొలిసారి పండుగ జరుపుకున్నట్లు హీరోయిన్ చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.  స్వతహాగా పంజాబీ అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిలైపోవడంతో తెలుగు సంప్రదాయాలను కూడా చార్మీ పాటిస్తోంది.
చిరంజీవి, రాంచరణ్ తదితరులు తమ ఇంట్లోనే గణపతి పూజ చేసుకుని.. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ పూజలో దర్శకుడు వీవీ వినాయక్ కూడా పాల్గొన్నారు.

షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఇంట్లో పండుగ సందడిని షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, దేవీ శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అల్లు శిరీష్ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement