woman canned
-
వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు
వేరే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఇండోనేషియాలో ఓ మహిళను బహిరంగంగా బెత్తంతో కొట్టారు. బాధతో ఆమె విలవిల్లాడుతూ గట్టిగా ఏడుస్తుంటే.. చుట్టూ ఉన్నవాళ్లంతా వినోదం చూస్తూ ఉండిపోయారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను వివిధ నేరాల కింద పట్టుకున్న అధికారులు.. రాష్ట్ర రాజధాని అయిన బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద అందరూ చూస్తుండగా బెత్తంతో దెబ్బలు కొట్టారు. వాళ్లలో 34 ఏళ్ల మహిళ తన భర్త కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆమెను ఏడుసార్లు బెత్తంతో కొట్టారు. కొట్టిన వ్యక్తి కళ్లు తప్ప మిగిలిన శరీరం మొత్తం దుస్తులతో నిండిపోయి ఉంది. దెబ్బలు కొడుతుంటే తనకు చాలా నొప్పిగా ఉందని ఆమె భరించలేక ఏడ్చేసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన వ్యక్తికి కూడా ఏడు దెబ్బల శిక్ష విధించారు. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారికి 100 చొప్పున బెత్తం దెబ్బల శిక్ష పడింది. మరోవ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడికి 22 దెబ్బలు పడ్డాయి. అతడి భాగస్వామి గర్భవతి కావడంతో.. ఆమెకు ఇంకా ఏశిక్ష విధించేదీ చెప్పలేదు. సాధారణంగా గర్భిణులకు ఇలాంటి శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. అసె రాష్ట్రానికి 2001 నుంచి ప్రత్యేక స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అక్కడ షరియా చట్టం అమలులో ఉంది. -
నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు
-
నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు
అక్కడ కొన్ని వందల మంది చుట్టూ నిల్చుని వినోదం చూస్తున్నారు. ఆ గుంపు మధ్యలో నిలబడి ఉన్న యువతి బాధతో విలవిల్లాడిపోతూ కేకలు పెడుతోంది. అది చూసి వాళ్లంతా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు అరుస్తోందో తెలుసా.. ఇస్లామిక్ చట్లాలను ఉల్లంఘించినందుకు ఆమెను బెత్తం పెట్టి నడివీధిలో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఈ ఆటవిక చర్య.. ఇండోనేషియాలో తాజాగా వెలుగుచూసింది. ఇండోనేషియాలోని చాలా రాష్ట్రాల్లో షరియా చట్టాన్ని గట్టిగా అమలుచేస్తారు. జూదం ఆడినా, మద్యం తాగినా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. తాజాగా శిక్ష పడిన యువతితో పాటు మొత్తం 13 మందిని.. వాళ్లలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. అంతా 21 నుంచి 30 ఏళ్లలోపు వారే. వీళ్లందరినీ ఆ రాష్ట్ర రాజధాని బందా అసేలో ఒక మసీదు వద్ద నిలబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టారు. దాన్ని చుట్టూ ఉన్న జనం వినోదం చూస్తూ నిలబడ్డారు తప్ప.. ఎవరూ వ్యతిరేకించే ధైర్యం చేయలేదు. పెళ్లికాని యువతీ యువకులు ఒకరినొకరు ముట్టుకోవడం, కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా వాళ్లు ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించారని తేల్చారు. మరో వ్యక్తి అయితే.. ఒక మహిళతో కలిసి రహస్య ప్రదేశంలో గడిపినందుకు శిక్ష విధించారు. వారిలో 22 ఏళ్ల మహిళ గర్భవతి కావడంతో.. ఆమెకు తాత్కాలికంగా శిక్ష నుంచి ఊరటనిచ్చారు. అయితే, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శిక్ష అమలుచేయాలని బందా అసె డిప్యూటీ మేయర్ జైనల్ అరిఫిన్ తెలిపారు. ఇలాంటి శిక్షలు కఠినమైనవే అయినా.. దీనివల్ల భవిష్యత్తులో ఇంకెవరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటారని అన్నారు. ఇటీవలి కాలంలో మహిళలు సహా పలువురికి ఇలా బహిరంగంగా బెత్తం దెబ్బల శిక్షలు పడుతూనే ఉన్నాయి.