Woman constable commits suicide
-
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, నిఖిల్ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది?
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెళ్లడి కావడం లేదు. -
Hyderabad: పెళ్లి అవదేమోనన్న దిగులుతో మహిళ కానిస్టేబుల్..
హైదరాబాద్: వివాహం కుదరదేమోనన్న ఆందోళనతో ఓ మహిళా కానిస్టేబుల్ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. శాలిబండ పోలీసులు తెలిపిన మేరకు.. కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె సురేఖ(28) ఛత్రినాక పోలీస్ స్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. వీరి కుటుంబం శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంషీర్‌గంజ్ కాల్వగడ్డలో నివాసం ఉంటుంది. గతంలో వివాహం నిశ్చయమవగా అనివార్య కారణాలతో రద్దయ్యింది. తాజాగా ఈ నెల 1న మరో యువకుడితో నిశ్చయమయినప్పటికీ ఇరు కుటుంబాల నడుమ గొడవలు తలెత్తాయి. ఈ వివాహం కూడా కుదరదేమోనన్న భయంతో ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని...
నకిరేకల్ : ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఓగోడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన అక్కనపల్లి పిచ్చయ్య-సోమక్క దంపతులకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన అక్కనపల్లి పద్మ (23) గత రెండు సంవత్సరాల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. మొదటి పోస్టింగ్ కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌కు కెటాయించారు. అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె స్వగ్రామమైన ఓగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పద్మ ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. అయితే ఏమైందో ఏమోకాని సదరు యువకుడు నాలుగు రోజుల క్రితం మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పద్మ ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలో పడి ఆమెను కుటుంబ సభ్యులు నకిరేకల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి పిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అనంతరం పద్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. గ్రామంలో జరిగిన పద్మ అంత్యక్రియలలో నల్లగొండ డీఎస్పీ సుధాకర్, శాలీగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రు, మహిళా పోలీసు సంఘం జిల్లా ప్రతినిధి సైదాభి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.