woman delivered on road
-
ఆసుపత్రిలోకి నో ఎంట్రీ.. రోడ్డుపైనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్!
న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ — Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022 గాజియాబాద్‌లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు -
రోడ్డుపైనే మహిళ ప్రసవం
పుట్లూరు (శింగనమల) : అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. స్థానిక మహిళలు ఆమెకు పురుడు పోశారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం శనగలగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన గీత, నాగేశ్వర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. గీత నాలుగోసారి గర్భం దాల్చడంతో స్వగ్రామం వచ్చారు. శుక్రవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం ఆశా కార్యకర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అప్పటికే ఆ ఆంబులెన్స్ మరో కేసులో ఉండటంతో రావడానికి ఆలస్యమైంది. దీంతో ఆటోలో ఆస్పత్రికి వెళ్లడం కోసం రోడ్డు వద్దకు వచ్చిన గీత కొద్దిసేపటికే స్థానిక మహిళల సాయంతో అక్కడే ప్రసవించి అడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం వచ్చిన 108 సిబ్బంది తల్లీబిడ్డలను పుట్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నాలుగు మండలాలకు ఒకే ఆంబులెన్స్ పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాలకు ఒకే 108 అంబులెన్స్ ఉండటంతో సకాలంలో వచ్చి ఆస్పత్రులకు తీసుకెళ్లడం ఆలస్యమవుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పుట్లూరులో ఒక అంబులెన్స్ ప్రజలకు అందుబాటులో ఉండేది. అనంతరం అంబులెన్స్‌ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రజలు ఆపద సమయంలో అవస్థలు పడాల్సిన దుష్టితి నెలకొంది.