woman harassed
-
యువతికి నిప్పంటించిన కీచకుడు
పట్నా: బిహార్‌లో యువతిపై మరో అకృత్యం చోటుచేసుకుంది. అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించినందుకు 23 ఏళ్ల ఆ యువతికి ఓ కీచకుడు నిప్పంటించాడు. బిహార్‌లోని అహియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని వెంటనే ముజఫరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. 85 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ యువతి కోమాలో కొట్టుమిట్టాడుతోంది. గత మూడేళ్లుగా తమ కుమార్తెను నిందితుడు వేధిస్తున్నాడని ఆమె తల్లి చెప్పింది. తాజా ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్‌చేశారు. ఈ ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బిహార్ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు వివరాలను నాలుగు వారాల్లోగా తమకు తెలపాల్సిందిగా కోరింది. ఈ నోటీసులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలకూ పంపింది. -
యువతి వేధింపులు భరించలేక...
కరీంనగర్ : యువతి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాలకు చెందిన యువకుడు కుమార్‌ను యువతి వేధింపులుకు గురి చేస్తుంది. ఆ క్రమంలో ఇటీవల మరీ వేధింపులు అధికమయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఆశ్రయించాడు. అయినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు శనివారం సూసైడ్ నోటు రాసి పురుగుల మందు సేవించాడు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోరిక తీరిస్తేనే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళను వేధించిన వడ్డీ వ్యాపారిపై మంగళవారం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని 3వ వార్డు, పాత డెయిరీఫారం ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ రెండు బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆ బంగారం విడిపించేందుకు లాసన్స్ బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిని కలిశారు. దీంతో రామకృష్ణ రూ.3 లక్షలు బ్యాంకులో కట్టి ఆమె బంగారాన్ని విడిపించాడు. అయితే ఆ బంగారంలో కొంత తన దగ్గరే ఉంచేసుకున్నాడు. దాన్ని ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బుకు నెలకు నూటికి రూ.12 చొప్పున వడ్డీ తీసుకుంటున్నాడు. వడ్డీ బాగా పెరిగిపోయిందని వెంటనే చెల్లించాలని నాలుగు నెలలుగా ఆమెపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. తాను ఒకేసారి అంత సొమ్ము చెల్లించలేనని ఆమె చెప్పడంతో తన కోరిక తీరిస్తే గడువు పెంచుతానని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన శారద ఆరిలోవ పోలీస్ స్టేషన్లో రామకృష్ణపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 420, 509, 506, 384, 384ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించకపోయిప్పటికీ అతను పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.