Woman kills husband
-
ఉద్యోగం మానేసి మరీ ప్రియుడికి దగ్గరైన సారిక..
నమ్మి ఇంటికి పిలిచిన స్నేహితుడు ఆ బంధానికే మచ్చతెచ్చాడు. స్నేహితుడు భార్యతో చనువు పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు.. కుటుంబంలో కలతలు సృష్టించి దంపతులను వేరు చేశాడు.. తమ ఇద్దరి సఖ్యతకు అడ్డుగా ఉన్నాడని పక్కా ప్రణాళిక రచించి చివరకు భార్యతోనే స్నేహితుడిని హత్య చేయించాడు. నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం చిత్తలూరులో ఇటీవల వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దారుణానికి తెగబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి కేసు వివరాలను వివరించారు. నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(29)కు మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన మామిడికాయల సారికతో 2011లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగిన తర్వాతా కొన్నేళ్లపాటూ మండలాపురంలో జీవించిన కిరణ్–సారిక దంపతులు 2015లో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. అక్కడే ఎన్టీఆర్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సారిక భర్త మాచర్ల కిరణ్‌కు హాస్పిటల్స్‌లో హౌస్‌కీపింగ్ పనులు కాంట్రాక్ట్ పట్టే యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన రొడ్డ మల్లేష్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహితుడి భార్యతో చనువు పెంచుకుని.. దీంతో మల్లేష్ తరచూ కిరణ్ ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలోనే మల్లేష్ స్నేహితుడి భార్య అయిన సారికతో చనువు పెంచుకుని సఖ్యతగా మెలుగుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత సారిక వ్యవహారశైలిని గుర్తించిన కిరణ్ నిలదీశాడు. దీంతో దంపతుల మధ్య పెరిగిన గొడవలు పెద్ద మనుషుల వద్దకు వెళ్లాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా భార్యాభర్తలకు సర్దిచెప్పి పంపించారు. ఇంటికి పిలిచి.. బండరాయితో మోది.. మల్లేష్ ప్రణాళిక రచించి సారికను అమలు చేయాలని ప్రోత్సహించాడు. అందులో భాగంగానే సారిక తనభర్త కిరణ్‌ను ఈనెల 20న చిత్తలూరుకు పిలిపించుకొని సపర్యలు చేసింది. అతడికి మద్యం తాగించి ఇంట్లో నేలపై పడుకోబెట్టింది. నిద్రలోకి జారుకున్న భర్త తలపై బునాది బండరాయితో రెండుమార్లు బలంగా మోది(కొట్టి) హత్య చేసింది. అనంతరం భర్తను చంపిన విషయాన్ని ఫోన్లో ప్రియుడు రొడ్డ మల్లేష్‌కు చెప్పి సూర్యాపేట జిల్లా అర్వపల్లి వైపు పారిపోయింది. ఈనేపధ్యంలో మృతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శాలిగౌరారం సీఐ రాఘవరావు ఎస్ఐ సతీష్ బృందం దర్యాప్తు చేపట్టారు. నిందితులు అర్వపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న విషయం తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ రాఘవరావు, ఎస్ఐ సతీష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఉద్యోగం మానేసి మరింత దగ్గరై.. సారిక హాస్పిటల్ ఉద్యోగం ఇబ్బందిగా ఉందని మానేసి మల్లేష్ వద్ద హౌస్‌కీపింగ్ సూపర్వైజర్గా పనిలో కుదిరింది. దీంతో వారిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. ఈ విషయం కిరణ్‌కు తెలియడంతో మళ్లీ దంపతులు గొడవపడ్డారు. దీంతో సారిక అలిగి ఆరు మాసాల క్రితం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. కాగా, ఈ క్రమంలో మల్లేష్ భార్య నెలరోజుల క్రితం అదృశ్యమైంది. అందుకు కిరణ్ కారణమని భావించి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని సారికతో ఫోన్లో చెప్పాడు. దీంతో సారిక కూడా తనభర్త కిరణ్ నుంచి తనకు వేధింపులు ఎక్కువ అయ్యాయని వాపోయింది. దీంతో కిరణ్ ను హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య.. అసలు ఏంజరిగిందంటే
సాక్షి, చిన్నకోడూరు(మెదక్): కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఇంటిని పట్టించుకోకపోవడం, వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరిగింది ఈ విషాదక ఘటన. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు మర్కంటి ఎల్లయ్య(55)కు భార్య నర్సవ్వ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూతురు రేణుకకు 2014లో అదే గ్రామానికి చెందిన ఇప్ప మహేందర్‌తో వివాహం జరిపించారు. కాగా ఎల్లయ్య, నర్సవ్వ మధ్య కుటుంబతగాధాలతో తరచూ గొడవ పడుతుండేవారు. దీనిపై కుల పెద్దల సమక్షమంలో ఎల్లయ్యను మందలించినా మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఎల్లయ్య భార్యతో గొడవ పడి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో ఎల్లయ్య పడుకున్నాక తెల్లవారు జామున 5 గంటల సమయంలో నర్సవ్వ ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త ఎల్లయ్య మెడను నరికింది. బలమైన గాయాలు కావడంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
భర్త గొంతు నులిమి చంపేసిన భార్య
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య గొంతు నులిమి చంపేసింది. భీమవరానికి చెందిన సత్యశర్మ, హేమ నాగమణి దపంతులు. వీరి మధ్య ఇటీవల కుటుంబ కలహాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త సత్య శర్మను భార్య హేమనాగమణి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కెలమంగలం : పెళ్లయిన ఆరు నెలలకే భార్య ప్రియునితో కలిసి భర్తను గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని అళేనత్తం గ్రామానికి చెందిన సోమశేఖర్(27)కు అదే ప్రాంతానికి చెందిన శారదమ్మ(22)తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. సోమశేఖర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవాడు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. బంధువులు సోమశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి మృతిలో సందేహం ఉన్నట్లు డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సోమశేఖర్ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో సోమశేఖర్‌ను దుప్పటితో గొంతునులిమి హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో సోమశేఖర్ భార్య శారదమ్మపై అనుమానం ఏర్పడిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తీవ్ర విచారణ చేపట్టారు. శారదమ్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోమశేఖర్ తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో అతని మిత్రుడైన అదే గ్రామానికి చెందిన బేటరాయన్‌తో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, సోమశేఖర్ ఇంట్లో లేని సమయంలో బేటరాయన్‌తో ఉల్లాస జీవితం కొనసాగించినట్లు, ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో గ్రామస్థులు తన భర్త సోమశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సోమశేఖర్ తనను తీవ్రంగా నిలదీశారు. దీంతో ప్రియుడు బేటరాయన్‌తో కలిసి సోమశేఖర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాను. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బేటరాయన్, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అప్పయ్యతో కలిసి సోమశేఖర్‌ను శారదమ్మ చుడీధార్ దుప్పటితో గొంతునులిమి హత్య చేశామని, ఈ సమయంలో బేటరాయన్ తనతో ఎవరైనా అడిగితే స్పృహకోల్పోయి మృతి చెందాడని చెప్పమని తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయారని శారదమ్మ పోలీసులకు వివరించింది. శారదమ్మను పోలీసులు అరెస్టు చేసి పరారీలో ఉన్న బేటరాయన్, అప్పయ్యలను గాలించి పట్టుకొన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య!
న్యూఢిల్లీ: మగబిడ్డ కోసం దుర్మార్గంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని అతని భార్య చంపేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన వారసత్వాన్ని, కుటుంబవ్యాపారాన్ని కొనసాగించేందుకు తనకు మగబిడ్డ కావాలని, ఇందుకోసం సోదరుడితో గడుపాల్సిందిగా ఆ వ్యక్తి భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భార్య నిరాకరించడంతో ఆమెను చితకబాదాడు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిస్తానని, ఆమెను వేశ్యగృహాలకు అమ్మేస్తానని బెదిరించాడు. ఆ దంపతులకు ఒక కూతురు ఉంది. మగబిడ్డ కోసం పలుసార్లు బాధితురాలికి అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఏడాదిపాటు అతని వేధింపులు భరించిన ఆమె.. గత ఆదివారం సహనం కోల్పోయి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. భర్త తాగిన పానీయంలో నిద్రమాత్రలు కలిపి.. అతడు నిద్రపోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఈ మరునాడు పోలీసులకు ఫోన్ చేసి తన భర్త హత్యకు గురయ్యాడని, ఇంటికి వచ్చిన అతిథులు అతన్ని చంపి ఉంటారని చెప్పింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె అల్లిన కథనాన్ని పోలీసులు చివరకు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాత్రి మూడు గంటలసమయంలో ఆమె ఇంటికి ఆమె సోదరుడు వచ్చిన విషయాన్ని సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా ధ్రువీకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా విచారించడంతో తామే పథకం ప్రకారం అతన్ని చంపామని ఆమె పోలీసులు ముందు అంగీకరించారు. ఆమెను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తన 18 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త చేతిలో ఎలాంటి హింసను, క్షోభను అనుభవించిందో వివరించింది. మగబిడ్డ కోసం పెళ్లయిన కొన్నేళ్ల నుంచే వేధించడం మొదలుపెట్టాడని, తమ మొదటి బిడ్డ పుట్టిన నాలుగేళ్లకే పౌష్టికాహార లోపంతో మరణించిందని, ఆ తర్వాత పలుసార్లు గర్భం దాల్చినా.. మగబిడ్డ కాదని పరీక్షల్లో తేలడంతో అబార్షన్లు చేయించాడని ఆమె వివరించింది. చివరకు సోదరుడితోనే గడుపాల్సిందిగా తనపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడని, దీనితో సహనం కోల్పోయి హత్య చేసినట్టు ఆమె తెలిపిందనిపోలీసులు వెల్లడించారు. -
భర్తను చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో..!
ఓ మహిళ భర్తను కాల్చిచంపి.. ఆ తర్వాత ఆయన శవాన్ని సూట్‌కేసులో పెట్టి.. బీఎండబ్ల్యూ కారులో వదిలేసిన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో మొదట పరారైన నిందితురాలు ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకుంది. పంజాబ్ మొహాలీలోని విలాసవంతమైన ప్రాంతంలో పార్కు చేసిన బీఎండబ్ల్యూ కారు వెనుక సీటులో సూట్‌కేసు అనుమానాస్పదంగా ఉండటంతో రిక్షా కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంసింగ్ ధిల్లాన్‌ను తానే కాల్చిచంపినట్టు ఆయన భార్య సీరత్ ధిల్లాన్ పోలీసులకు తెలిపారు. ఆమె తల్లి జస్విందర్ కౌర్, సోదరుడు వినయ్‌ప్రతాప్ సింగ్ బ్రార్‌లపై కూడా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంసింగ్ హత్యకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో ఏకంసింగ్ను తన లైసెన్స్డ్ గన్‌తో కాల్చిచంపానని, ఈ కుట్రలో తన సోదరుడు, అతని స్నేహితుడు సహకరించారని నిందితురాలు పోలీసులకు తెలిపింది. బీఎండబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేయాలని తాము భావించామని, కానీ, కారు తాళాలు దొరకకపోవడంతో ఉదయాన్నే శవాన్ని తరలించాలని తాము భావించామని, ఇంతలో పోలీసులకు తెలిసిపోయిందని ఆమె చెప్పారు.