భర్తను చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో..! | Woman kills husband, dumps body in his BMW | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో..!

Published Mon, Mar 20 2017 12:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

భర్తను చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో..!

భర్తను చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో..!

ఓ మహిళ భర్తను కాల్చిచంపి.. ఆ తర్వాత ఆయన శవాన్ని సూట్‌కేసులో పెట్టి.. బీఎండబ్ల్యూ కారులో వదిలేసిన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో మొదట పరారైన నిందితురాలు ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకుంది. పంజాబ్‌ మొహాలీలోని విలాసవంతమైన ప్రాంతంలో పార్కు చేసిన బీఎండబ్ల్యూ కారు వెనుక సీటులో సూట్‌కేసు అనుమానాస్పదంగా ఉండటంతో రిక్షా కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏకంసింగ్‌ ధిల్లాన్‌ను తానే కాల్చిచంపినట్టు ఆయన భార్య సీరత్‌ ధిల్లాన్‌ పోలీసులకు తెలిపారు. ఆమె తల్లి జస్విందర్‌ కౌర్‌, సోదరుడు వినయ్‌ప్రతాప్‌ సింగ్‌ బ్రార్‌లపై కూడా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంసింగ్‌ హత్యకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో ఏకంసింగ్‌ను తన లైసెన్స్‌డ్‌ గన్‌తో కాల్చిచంపానని, ఈ కుట్రలో తన సోదరుడు, అతని స్నేహితుడు సహకరించారని నిందితురాలు పోలీసులకు తెలిపింది. బీఎండబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేయాలని తాము భావించామని, కానీ, కారు తాళాలు దొరకకపోవడంతో ఉదయాన్నే శవాన్ని తరలించాలని తాము భావించామని, ఇంతలో పోలీసులకు తెలిసిపోయిందని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement