on women
-
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి
‘‘అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. కాలం గడిచే కొద్ది నా జర్నీలో సినిమాపై చాలా ఇష్టం పెరిగింది. సినిమా మాధ్యమంతో ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయవచ్చని తెలుసుకున్నాను’’ అని అన్నారు కథానాయిక నిత్యామీనన్. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యామీనన్ పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ తక్కువగా ఉంటుందనే మాటలు వినిపిస్తుంటాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు నిత్యామీనన్ బదులు ఇస్తూ–‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మహిళలపై వేధింపులు ఉంటాయనుకుంటే పొరపాటే. అన్ని సెక్టార్స్‌లోనూ ఉన్నాయి. నా కెరీర్లో ఎప్పుడూ ఒక మహిళగా నాకు భద్రత లేదని అనిపించలేదు. కానీ, కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నించారు. నేను ఊరుకోలేదు. ‘మహిళలంటే గౌరవం లేదా? కాస్త హుందాగా వ్యవహరించు’ అంటూ ఘాటుగానే స్పందించాను. ఏ విషయంలోనైనా ఎంతోకొంత మన ప్రమేయం ఉన్నప్పుడే ఇతరులు జోక్యం చేసుగోలరు. అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నిర్మొహమాటంగా మన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి.. బెదిరిపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు. -
ఇది ‘మీ టూ’ కాదు.. ‘మెన్ టూ’ ఉద్యమం
బెంగళూరు: పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారి అసలు రంగులు బయటపెడుతున్న మహిళలపై లైంగిక వేధింపుల నిరసన ఉద్యమం ‘మీ టూ’ తరహాలో మరో ఉద్యమం ప్రారంభమైంది. దీని పేరు ‘మెన్ టూ (పురుషులు కూడా)’. మహిళల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల గొంతుకగా ఇది నిలవనుందని ఈ ఉద్యమాన్ని ప్రారంభించినవారు చెబుతున్నారు. 2017లో ఒక లైంగిక వేధింపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన మాజీ ఫ్రెంచ్ రాయబారి పాస్కల్‌మాజురి సహా ఓ 15 మంది కలిసి ఈ ‘మెన్ టూ’ని ప్రారంభించారు. స్త్రీలపైనే కాదు.. పురుషులపైనా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఇక పురుషులు కూడా నోరు విప్పి తమపై స్త్రీలు చేసే వేధింపులను చెప్పాలని ఈ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, పురుషులపై పెట్టే తప్పుడు వేధింపుల కేసులకు వ్యతిరేకంగా కూడా పోరాడుతామన్నారు. లైంగిక సమానత్వ చట్టాలు రావాలని వారు కోరుతున్నారు. మీ టూ ఉద్యమాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే, ఆ పేరుతో వ్యక్తిగత కక్షలతో తప్పుడు అభియోగాలు మోపి, మర్యాదస్తుల పరువు తీయొద్దని కోరుకుంటున్నామని వివరించారు. -
విశాఖలో మహిళలపై పోలీస్ దౌర్జన్యం
-
ఇదేమి రాజ్యం?
- నేటికీ మహిళలపై వరకట్న వేధింపులు – ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కరువు – పెరుగుతున్న మహిళల హత్యలు, ఆత్మహత్యలు జిల్లాలో మహిళా పోలీసుల వివరాలు : డీఎస్పీలు – 0 సీఐలు – 0 ఎస్ఐలు– 2 ఏఎస్ఐలు–8 కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్స్ వరకూ – 60 ఆరునెలల క్రితం జిల్లాకు చెందిన ఉన్నత చదువులు చదివిన ఓ విద్యావంతురాలు బెంగళూరులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సమయంలో కోట్ల రూపాయలు కట్నకానుకలుగా ఇచ్చినా వారి ధనదాహం తీరలేదు. అదనపు కట్నం కోసం వేధించారు. దాదాపు సంవత్సరం పాటు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ జరిగినా న్యాయం జరక్కపోవడంతో తన చావుకు కారణమైన వ్యక్తుల పేర్లు సూసైడ్‌నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వారం రోజుల క్రితం నగరంలో సోమనాథ్‌నగర్‌లో భార్యను భర్త, అత్తమామలు కలిసి హత్య చేశారు. సదరు భర్త కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో ప్రభుత్వ టీచర్. ఉన్నతస్థానంలో కొనసాగుతున్నా భార్యను నిత్యం వేధించేవాడు. ఆమెను చంపేసిన తర్వాత కూడా పాఠశాలకు చదువు చెప్పేందుకు వెళ్ళాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు. బాధితురాలి తల్లిదండ్రులు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేక చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం సెంట్రల్: జిల్లాలో మహిళలకు రక్షణ కరవవుతోందా? పోలీసు స్టేషన్లో వారి సమస్యలు వినే వారు కూడా లేరా? మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆత్మహత్యలను బట్టి చూస్తే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. పోలీసుశాఖలో మహిళా ఉన్నతాధికారులు లేకపోవడం.. వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిద్దామనే సంకల్పం ఉన్న అధికారులు కొరవడుతోంది. ఫలితంగా జిల్లాలో ఎక్కడో ఒక చోట మహిళల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సగటున ఏడాదికి 300 పైచిలుకు మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం చిన్న చిన్న మనస్పర్థలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నూరేళ్లు సంతోషంగా కలిసి కాపురం చేయాల్సిన దంపతులు పంతాలు, పట్టింపులకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలతో పాటు వారిపై ఆధారపడిన చిన్నపిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. రెండు నెలల క్రితం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌కోలో ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వారికి మూడు, ఐదేళ్ల చిన్న కుమార్తెలున్నారు. రెండురోజుల క్రితం సోమనాథ్‌నగర్‌లో భార్యను హత్య చేసిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల చిన్న కుమారుడు ఉన్నారు. సమస్యలు వినేవారేరీ? ఓ గృహిణికి ఇంట్లో సమస్య ఏర్పడితే వెంటనే పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తుంది. అయితే సదరు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఆమెకు ఉన్న సమస్యలను నిరభ్యంతరంగా చెప్పుకోగలుతోందా అంటే లేదనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అరకొరగా కానిస్టేబుల్స్ స్థాయిలో ఉన్నా వారు పరిష్కారం చూపలేరు. తిరిగి ఎస్ఐ వద్దకో సీఐ వద్దకో పంపుతారు. అన్నీ చెప్పుకోలేక సదరు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో డీఎస్పీలు, సీఐల స్థాయిలో ఒక్కరంటే ఒక్కరూ మహిళా అధికారి లేరు. మహిళా సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఓ కౌన్సిలింగ్ సెంటర్, ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పనిచేస్తున్నది అందరూ మగ అధికారులే. చివరికు మహిళా గ్రీవెన్ సెల్‌కు కూడా మహిళా అధికారులు కరువయ్యారు. డీఎస్పీ, మానసిక వైద్య నిపుణులు అందరూ మగ అధికారులే ఉండటం గమనార్హం. పోలీసుశాఖకు చెడ్డపేరు ఇదిలా ఉంటే మహిళా అధికారుల కొరత పోలీసుశాఖకూ చెడ్డపేరు తెస్తోంది. కీలకమైన సమయాల్లో, ధర్నాలు, ఆందోళనలు, వీవీఐపీ బందోబస్తు సమయాల్లో మహిళా అధికారుల అవసరం ఏర్పడుతోంది. కలెక్టరేట్ వద్ద మహిళా నేతలు, కార్మికులు ఆందోళనలు చేపట్టినప్పుడు వారిని అడ్డుకోవడం కష్టతరంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులే వారిని లాగి పడేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ సందర్భంలో మహిళల గౌరవానికి కొంత లోటు ఏర్పడుతూ అనేక సార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా మహిళా పోలీసు సిబ్బందిని పెంచాలని మహిళలు కోరుతున్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తాం - జీవీజీ అశోక్‌కుమార్: జిల్లా ఎస్పీ మహిళలపై దాడులు, వరకట్న వే«ధింపులు జరుగుతుండటం బాధాకరం. మహిళలు ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి. పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా రక్షణ కల్పిస్తాం. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. అలాగే మహిళలపై దాడి జరిగిట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అరెస్ట్‌లు చేసి జైలుకు పంపిస్తాం.