women allegations
-
'డబ్బు కోసమే బాబర్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది'
కరాచీ : నాలుగు వారాల క్రితం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తనను లైంగికంగా వేధించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హమీజా ముక్తర్ అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె బాబర్ అజమ్‌పై సంచలను ఆరోపణలు చేసింది. ఇదే విషయమై ఆమె బాబర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బాబర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఇదే విషయమై బాబర్ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హమీజా పిటిషన్‌పై గురువారం సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్ తరపు లాయర్ మాట్లాడుతూ.. హమీజ్.. బాబర్‌పై అనవసర ఆరోపణలు చేస్తుంది.. కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతుందని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని కోర్టుకు తెలిపారు. బాబర్ అజమ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని హమీజా తరపు లాయర్ కోర్టుకు స్పష్టం చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలు పరిశీలిస్తామని తెలిపి కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. ('బాబర్ అజమ్ నన్ను నమ్మించి మోసం చేశాడు') కాగా హమీజా గతంలో చేసిన వ్యాఖ్యలు పాక్ మీడియాలో సంచలనంగా మారాయి. 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని పేర్కొంది. బాబర్ అజబ్ ఇటీవలే పాకిస్తాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే వేలి గాయంతో బాబర్ అజబ్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా డిసెంబర్ 26 నుంచి పాక్, న్యూజిలాండ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. అయితే బాబర్ గాయం తీవ్రత అలాగే ఉండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను కివీస్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసకుంది. -
'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు'
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే) 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొంది. So this lady has made accusations against Babar Azam "he promised to marry me, he got me pregnant, he beat me up, he threatened me and he used me" Video courtesy 24NewsHD pic.twitter.com/PTkvdM4WW2 — Saj Sadiq (@Saj_PakPassion) November 28, 2020 అయితే మహిళ చేసిన ఆరోపణలపై బాబార్ అజమ్ స్పందించలేదు.మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాక్ క్రికెట్ బోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. (చదవండి : తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్) కాగా కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో వారు ప్రస్తుతం 14 రోజుల ఐసోలేషన్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న కివీస్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. అయితే తాజాగా పాక్ టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితం అయ్యారు. -
ట్రంప్ మమ్మల్ని అసభ్యంగా తాకారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గతంలో తమను అసభ్యంగా తాకారని ముగ్గరు మహిళలు ఆరోపించారు. వారిలో ఒకరు తనను పెదవుల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పగా, మరొకరు చెప్పరాని చోట తాకారని అన్నారు. ఇంకొకరు తనను వెనక భాగంలో అసభ్యంగా నొక్కారన్నారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. మహిళలను అసభ్యంగా తాకడం గురించి ట్రంప్ 2005లో చెప్పిన మాటల వీడియో విడుదల అయిన తర్వాత ఈ ఆరోపణలు రావడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలను రెండో డిబేట్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా విమర్శించారు. మహిళలను గతంలో వాళ్ల అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నారా అని ప్రశ్నించినపుడు ఆయన లేదని సమాధానం ఇచ్చారు. ట్రంప్ అనుచరులు కూడా తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించి.. అది ఆయన వ్యక్తిత్వ హననమే అవుతుందన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను, ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినట్లు జెస్సికా లీడ్స్ అనే వ్యాపారవేత్త చెప్పారు. అప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా తాకారన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ను తీసేసి.. తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని, తన స్కర్టు మీద కూడా చెయ్యి వేశారని ఆమె అన్నారు. అతడు ఆక్టోపస్ లాంటివాడని, అతడి చేతులు అన్నిచోట్లా ఉన్నాయని ఆరోపించారు. అప్పటికి తన వయసు 38 ఏళ్లన్నారు. దాంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు. రాషెల్ క్రూక్స్ (22) అనే మరో మహిళ 2005లో ట్రంప్ టవర్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారని, తనను తాను ఆయనకు పరిచయం చేసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వగా, ట్రంప్ ముందు బుగ్గల మీద, తర్వాత పెదాల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పారు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని, తాను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన కార్యాలయానికి వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు కావాలని అడగ్గా.. తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారన్నారు. తాను పనిచేసే బేరాక్ గ్రూప్ కంపెనీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా తాను చెప్పాల్సి వచ్చింది గానీ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు మాత్రం ఎప్పుడూ తనకు ఫోన్ చేయలేదన్నారు. 13 ఏళ్ల క్రితం ఒక రిసార్టులో తన పృష్టభాగంలో ట్రంప్ తనను అసభ్యంగా నొక్కారని మరో మహిళ ఆరోపించారు. మిండీ మెకగ్ గిల్లివ్రే (36) అనే మహిళ ఈ ఆరోపణలు చేశారు. అప్పట్లో తాను ఒక ఈవెంటు ఫొటోగ్రాఫర్‌తో కలిసి అక్కడకు వెళ్లానని, వెనక భాగంలో ఏదో ఇబ్బందిగా అనిపిస్తే తొలుత కెమెరా బ్యాగ్ తగిలందనుకున్నానని, కానీ వెనక్కి తిరిగి చూసి దిగ్భ్రాంతి చెందానని చెప్పారు. అయితే... ఇప్పుడు ఆరోపణలు చేసిన మహిళలిద్దరిలో ఎవరూ ఘటనలు జరిగినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ట్రంప్ మాత్రం న్యూయార్క్ టైమ్స్ పత్రిక మీద పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కథనం అంతా అవాస్తవమని, ఆ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాసన్ మిల్లర్ మండిపడ్డారు. మహిళల ఆరోపణల గురించి తాము ప్రశ్నించిప్పుడు ట్రంప్ చాలా ఆవేశపడ్డారు తప్ప స్పందించలేదని పత్రిక ప్రతినిధులు వెల్లడించారు.