women suicidea attempt
-
హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తితో పరిచయం కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన వివాహిత సౌజన్యకు కొద్దిరోజుల క్రితం తిరుపతి అనే వ్యక్తి నుంచి మిస్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరిగి కాల్ చేయడంతో అనుకోకుండా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఈ పరిచయం కాస్తా చనువుగా మారింది. దీంతో, తిరపతి.. సౌజన్యకు తరచుగా కాల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మాయ మాటలు చెప్పి క్లోజ్ అయ్యాక.. వీడియో కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే, వీడియో చేసిన తర్వాత థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సౌజన్య ఫోన్లోని డేటాను తిరపతి తస్కరించాడు. అనంతరం, వారిద్దరూ చనువుగా మాట్లాడుకున్న వీడియోలను తన భర్తకు, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇక, ఈ విషయం తన భర్తకు తెలియడంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో, నీటి సంపులో దూకి సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సౌజన్య మృతిచెందింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, సౌజన్య ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: విశాఖలో రియల్టర్, భార్య కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు -
వివాహిత ఆత్మహత్యాయత్నం
భీమారం: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని వివాహిత ఆందోళనకు దిగింది. ఈమేరకు భర్త ఇంటికి ముందు ధర్నా చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కిరోసిన్ పోసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... నగరంలోని ఒకటో డివిజన్‌కు చెందిన నరేడ్ల వేణుకు అదే ప్రాంతానికి చెందిన చొప్పరి సరస్వతి, రవీందర్ దంపతుల కూతురు హేమలతతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.13లక్షలు నగదు, 10తులాల బంగారంతో పాటు ఇతర ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం వేణు (సీఐఎ‹స్ఎఫ్, చెన్నై) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహ అనంతరం భార్యను చెన్నైకి తీసుకెళ్లాడు. కొంతకాలం వారి కాపురం సవ్యంగానే సాగినా తర్వాత కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం (రూ.10లక్షలు) తీసుకురమ్మని వేణు వేధింపులకు గురి చేస్తున్నాడని హేమలత ఆరోపించింది. ఇదిలా ఉండగా వేణు వేధింపులు భరించలేక హేమలత తన భర్త విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ప్రవర్తన మార్చుకోవాలని వేణును హెచ్చరించారు. దీంతో వేణు భార్యతో కొంతకాలం బాగానే ఉన్నాడు. తదనంతరం భార్య హేమలతను పైడిపల్లికి తీసుకొచ్చాడు. నాలుగేళ్ల నుంచి హేమలత తల్లిగారింటి వద్దే ఉంటుంది. తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హేమలత హసన్çపర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తల కేసు కావడంతో వారు మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అయితే తనకు అక్కడ కూడా న్యాయం జరగలేదని, చివరికి న్యాయం కోసం ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. ఆత్మహత్యాయత్నం... తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన హేమలత అసహనానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడి ఉన్న పోలీసులు ఆమెను నివారించి, హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
అమ్మా.. నేనేమి చేశాను నేరం
అమ్మా.. నేనేమి చేశాను నేరం కడుపున పడంగనే ఆనందపడ్డావు..! కష్టమనకా.. నవమాసాలు మోశావు..!! పురిటినొప్పులు భరించి జన్మనిచ్చావు..! అల్లారుముద్దుగా పెంచుకుని లాలించావు..!! కష్టమొచ్చిందని.. కన్నపేగు తెంచుకుంటివా..?! లోకం తెలియని నన్ను నీతో తీసుకెళ్లావా..!! అమ్మా.. నేనేమి చేశాను నేరం.! ఆడజన్మ ఎత్తినందుకు ఎందుకీ శాపం..!! ...అంటూ ఆ చిన్నారి అనంతాల్లో కలిసిపోయింది. తండ్రి కట్న పైశాచికత్వాన్ని తట్టుకోలేని ఓ తల్లి లోకాన్ని విడిస్తూ.. కన్నకూతురునూ వెంట తీసుకెళ్లింది. కట్నం వేధింపులకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండ లం వంతడుపులలో బూర్ల రమ్య(28) తన కూతురు మనుశ్రీ(4)తో కలిసి చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. – ఇల్లందకుంట(హుజూరాబాద్) సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ,పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన బూర్ల గణేశ్‌కు ఇదే మండలం మల్యాల గ్రామానికి చెందిన రమ్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నకానుకలుగా రూ. మూడున్నర లక్షలు అందించారు. మొదటల్లో వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లకు మనుశ్రీ జన్మించింది. అప్పటి నుంచి గణేశ్ తీరులో మార్పు వచ్చింది. ఏ పని చేయకుండా ఖాళీగా తిరగడం ఆరంభించాడు. నిత్యం రమ్యను వేధించేవాడు. దీనికి గణేశ్ తల్లిదండ్రులు కొమురమ్మ, పోశయ్య, ఆడబిడ్డ వనిత వత్తాసు పలికి నిత్యం అదనపు కట్నం తేవాలని శారీరకంగా, మానసికంగా వేధించేవారు.ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. కూతురు కాపురం బాగుండాలని రమ్య తల్లిదండ్రులు గణేశ్ అడిగిన మొత్తాన్ని దశలవారీగా ముట్టజెప్పారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. మరింత డబ్బు కావాలని రమ్యనే వేధించాడు. ఈ క్రమంలో కొద్ది మాసాల క్రితం తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మేందుకు గణేశ్ పూనుకోగా.. దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో రమ్య పుట్టింటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పొలం అమ్మవద్దని, మరో రూ.లక్షను మనుమరాలి పేరిట బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కిరాణాషాపు నిర్వహించుకోవాలని అవసరమైన సామగ్రిని సైతం కొనిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం దంపతుల మధ్య గొడవ జరిగింది. సాయంత్రం పూట కూతురు మనుశ్రీని తీసుకుని వెళ్లి ఇంటి శివారులో ఉన్న చాదబావిలో దూకింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. బుధవారం వేకువజామున రెండు మృతదేహాలు బావిలో తేలాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఏసీపీ టి. కృపాకర్, తహసీల్దార్ రమేశ్ ఘటనాస్థలానికి వచ్చారు. బావిలో నుంచి మృతదేహాలు తీయించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో రమ్య భర్త గణేశ్, అత్తామామలు కొమురమ్మ, పోశయ్య, ఆడబిడ్డ వనితపై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
నవ వధువు ఆత్మహత్య
ధారూరు (రంగారెడ్డి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం గ్రామానికి చెందిన రాజు తల్లిదండ్రులు 12 సంవత్సరాల క్రితం ధారూరుకు వచ్చి 2.20 ఎకరాల భూమిని తీసుకుని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రాజుకు ఏప్రిల్ 25వ తేదీన పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన అనురాధ (21)తో వివాహం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు చిన్న కొడుకుతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడే కూలి పని చేసుకుంటున్నారు. రాజు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. కాగా రాజు ఆదివారం పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనురాధ దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజు తలుపులు తీసి చూడగా భార్య అనురాధ దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రాజు ధారూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా అనురాధ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. -
తెల్లారితే పెళ్లి... అంతలోనే
జన్నారం(కరీంనగర్): పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రానికి వెళ్లడం ఇష్టం లేక నవవధువు సూపర్‌వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంటా విషాదం చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన టేకుమంట్ల రాజన్న, పంకజ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో కూతురు ఆమని(28) ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 4న నిశ్చితార్థం కూడా జరిపారు. గురువారం(నేడు) వివాహం జరగాల్సి ఉంది. ఆమనిని వివాహం చేసుకునే వ్యక్తి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని ముంబయికి వెళ్లాల్సి ఉందనే బెంగతో ఉండేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయిన దూరంగా వెళ్లి ఉండటం ఇష్టలేక బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్ తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. పెళ్లికి అంతా సిద్ధం.. ఆమని వివాహం కోసం తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. సామగ్రి తెచ్చారు. పెళ్లి పత్రికలు పంచారు. టెంట్లు వేశారు. వంటమనిషిని మాట్లాడారు. వంట సామగ్రి తీసుకువచ్చారు. పచ్చనిపందిరి కోసం పొరకకు వెళ్దామనే సమయంలో అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులతోపాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతురాలి తల్లి పంకజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్షణికావేశమే మృత్యుపాశం
జి.మాడుగుల(పాడేరు): మానసిక ఒత్తిడిలో క్షణికావేశంతో ఓ వివాహిత ముక్కుపచ్చలారని బిడ్డతో సహా పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో జరిగిన వాగ్వాదమే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడేలా చేసిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ సంఘటన జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన చల్లా లోవరాజు ఈ ప్రాంతంలో పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. మండలంలోని సింగర్భ పంచాయతీ చేపల్లికి చెందిన దేవుడమ్మ(దేవి)(28)ను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. నాలుగేళ్ల దేవరాజు, రెండేళ్ల పాప, ఏడు నెలల బాబు ఉన్నారు. కుంటుంబంతో చేపల్లిలోనే ఉంటున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళతానని లోవరాజు భార్యతో చెప్పాడు. ఆమె ససేమిరా అంది. ఈమేరకు ఇద్దరి మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. పిల్లలు, తనను విడిచి భర్త దూరంగా వెళ్లడం ఇష్టంలేక దేవుడమ్మ మానసికంగా ఒత్తిడికి గురైంది. అదే రోజు రాత్రి భోజనం అనంతరం ఏడు నెలల చంటిబిడ్డతో ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఉదయానికి భార్యబిడ్డ కనిపించకపోవడంతో..వారి ఆచూకీ కోసం బుధవారం గ్రామస్తులతో కలిసి బంధువుల ఇళ్లు, పలు ప్రాంతాల్లో లోవరాజు వెదికాడు. ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయానికి గ్రామానికి సమీపంలోని పాడుబడిన నేల బావి వద్ద చెప్పులు, దుప్పటి, టార్చిలైటు కనిపించాయి. వెళ్లి పరిశీలించగా బాలుడు బావిలో శవమైన కనిపించాడు. అందులో వెతకగా కొంత సేపటికి దేవుడమ్మ శవం కూడా బయటపడింది. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె సోదరుడు కిముడు బొంజాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త లోవరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేరు కాపురం పెట్టలేదని..
నల్గొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కంభంపాటి నాగరాజు, సులోచన (25) భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వేరు కాపురం పెట్టాలనే విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భర్త బయటకు వెళ్లిన సందర్భంలో సులోచన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన అత్తమామలు మంటలార్పి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది.