Womens Squash Association
-
జోష్నా సంచలనం
రిచ్మండ్ ఓపెన్ టైటిల్ సొంతం ఫైనల్లో మాజీ నంబర్‌వన్‌పై గెలుపు రిచ్మండ్ (అమెరికా): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప సంచలనం సృష్టించింది. రిచ్మండ్ ఓపెన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. తద్వారా తొమ్మిదోసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యుఎస్‌ఏ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ 21వ ర్యాంకర్ జోష్నా 11-9, 11-5, 11-8తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ రాచెల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. గ్రిన్హమ్తో తలపడిన ఆరు పర్యాయాల్లో భారత క్రీడాకారిణి గెలవడం ఇదే మొదటిసారి. అలాగే గతవారం టెక్సాస్ ఓపెన్‌లో ఆమె చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. -
జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్
విన్నిపెగ్ (కెనడా): భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప తన కెరీర్లో తొలిసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించింది. విన్నిపెగ్ వింటర్ క్లబ్ ఓపెన్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరిగిన ఫైనల్లో జోష్నా 11-13, 11-8, 11-5, 3-11, 12-10తో హెబా ఎల్ టొర్కీ (ఈజిప్ట్)పై చెమటోడ్చి నెగ్గింది. టైటిల్ కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో ప్రతీ గేమ్ సుదీర్ఘ ర్యాలీలకు దారితీసింది. చివరకు ప్రపంచ 27వ ర్యాంకర్ జోష్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించి తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మొత్తం మీద భారత్ ఖాతాలో వరుసగా ఇది రెండో డబ్ల్యూఎస్‌ఏ వరల్డ్ టూర్ టైటిల్ కావడం విశేషం. గతేడాది దీపికా పల్లికల్ ఈ టైటిల్ గెలుచుకుంది.