Working president Telangana
-
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరేవారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు? కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి, పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు, సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. కొద్ది రోజులుగా ప్రభాకర్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు ఆయన నియామకాన్ని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ బుధవారం ప్రకటించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ కమిటీతోపాటు తొమ్మిది అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ, క్యాంపేయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్డీఎంఆర్సీ కమిటీ, ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పేరుతో అనుబంధ కమిటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పించారు. కాగా.. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులకు మూడు, నాలుగు కమిటీల్లో స్థానం కల్పించగా, మరికొందరిని విస్మరించారు. కోర్‌కమిటీలో దక్కని చాన్స్.. మిగతా కమిటీల్లో పెద్దపీట..ఏఐసీసీ, టీపీపీసీలు కీలకంగా భావించిన తొమ్మిది కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు అవకాశం కల్పించి పెద్దపీట వేశారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్ఎస్ బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్ తదితర 15 మందితో కూడిన కోర్‌కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇతర జిల్లాలకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, ఎ.సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి జాబితాలో మనవాళ్ల పేర్లు లేవు. 53 మందితో కూడిన కో ఆర్డినేషన్ కమిటీలో పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం దక్కింది. 17 మందితో కూడిన ప్రచార కమిటీ (క్యాంపెయిన్ కమిటీ) చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క కాగా, ఇందులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, హర్కర వేణుగోపాల్, బల్మూరి వెంకట్‌కు, 41 మందితో కూడిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్‌బాబు, కటకం మృత్యుంజయంకు అవకాశం కల్పించారు. వివిధ అనుబంధ సంఘాల నుంచి 11 మందిని శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొనగా, ఇందులో ఆరెపల్లి మోహన్, నేరెళ్ల శారద తదితరులకు జిల్లా నుంచి అవకాశం దక్కింది. మెనిఫెస్టో, ప్లానింగ్ కమిటీల్లో మనోళ్లు.. ఎల్డీఎంఆర్సీ చైర్మన్‌గా ఆరెపల్లి మోహన్.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కో చైర్‌పర్సన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్‌గా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించగా, ఈ కమిటీలో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన నలుగురికి అవకా శం కల్పించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, డాక్టర్ గీట్ల సవితా రెడ్డి, హర్కర వేణుగోపాల్, సయ్యద్ అస్మతుల్లా హుస్సేన్‌ను నియమించారు. స్ట్రాటజీ, ప్లానింగ్ కమిటీలో మాజీ మం త్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌తోపాటు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో చేరిన సీహెచ్ విజయరమణా రావుకు అవకాశం కల్పించారు. ఎల్డీఎంఆర్సీ కమిటీకి మాజీ విప్ ఆరెపల్లి మోహన్‌ను చైర్మన్‌గా, హర్క ర వేణుగోపాల్‌ను కన్వీనర్‌గా నియమించారు. తొమ్మిది మందితో కూడిన ఎలక్షన్ క మిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి కాగా మాజీ ఎమ్మెల్సీ, జిల్లాకు చెందిన బి.కమలాకర్‌రావును కో చైర్‌పర్సన్‌గా నియమించారు. ఏడుగురు సభ్యుల డిసిప్లీనరీ కమిటీలో కూడా బి.కమలాకర్‌రావును కన్వీనర్‌గా నియమించారు. పలువురు సీనియర్ల విస్మరణ.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ, టీపీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెంది న పలువురికి అవకాశం కల్పించినా.. ఇంకొందరు సీనియర్ల ఊసే మరిచారు. పక్క జిల్లాలో పార్టీ మారిన నేతల పేర్లను రెండు, మూడు కమి టీల్లో వేసిన అధిష్టానం.. జిల్లాకు చెందిన పలు వురు సీనియర్లను విస్మరించిందన్న వాదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. అధికార ప్రతి నిధిగా ఉన్న ప్యాట రమేష్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు సుద్దాల దేవయ్య, కేకే మహేందర్‌రెడ్డి, కొమిరెడ్డి రామ్‌లు, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కొలగాని మహేశ్‌తోపాటు పలువురి పేరుŠల్ కమిటీల్లో కనిపించ లేదు. కీలకమైన ఈ కమిటీల్లో పలువురిని విస్మరించడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. గతంలో నిర్వహించిన పదవులు : 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుల ఫోరమ్ కన్వీనర్ (ఉమ్మడి రాష్ట్రంలో), ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ (2005–2009), పీసీసీ మీడియా కో ఆర్డినేటర్ (2002–2004), యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(2002–2003), ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (1999–2002), ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు (1992–1998), ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి (1989–1991), ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి (1987–1989), ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు(1987–88). -
బలోపేతానికి కృషి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఐదారు నెలల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా సమీక్షసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండలకేంద్రాల్లోపార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా నాయకులకు సూచించారు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలోని ఇతర నాయకులతో పార్టీ జిల్లా కన్వీనర్ మాట్లాడి నెలరోజుల్లో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దుగా ఉన్న నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేసి తనకు అందజేయాలని జిల్లా నాయకులను ఆయన కోరారు. ముందుగా వారితో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. గతంలో పార్టీలో ఉన్న నాయకులు మళ్లీ చురుకైన పాత్రను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్నేని బాబు, సీనియర్ నాయకులు గాదె నిరంజన్‌రెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి(నాగార్జునసాగర్), జి.జైపాల్‌రెడ్డి(భువనగిరి), వి.వెంకటేశ్ (ఆలేరు), సునీల్‌కుమార్ (నల్గొండ అర్బన్), జిట్టా రామిరెడ్డి (సూర్యాపేట), ఎం.గవాస్కర్‌రెడ్డి(మునుగోడు), రాష్ర్ట పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.