సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఐదారు నెలల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా సమీక్షసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండలకేంద్రాల్లోపార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా నాయకులకు సూచించారు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలోని ఇతర నాయకులతో పార్టీ జిల్లా కన్వీనర్ మాట్లాడి నెలరోజుల్లో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పారు.
గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దుగా ఉన్న నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేసి తనకు అందజేయాలని జిల్లా నాయకులను ఆయన కోరారు. ముందుగా వారితో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. గతంలో పార్టీలో ఉన్న నాయకులు మళ్లీ చురుకైన పాత్రను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్నేని బాబు, సీనియర్ నాయకులు గాదె నిరంజన్‌రెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి(నాగార్జునసాగర్), జి.జైపాల్‌రెడ్డి(భువనగిరి), వి.వెంకటేశ్ (ఆలేరు), సునీల్‌కుమార్ (నల్గొండ అర్బన్), జిట్టా రామిరెడ్డి (సూర్యాపేట), ఎం.గవాస్కర్‌రెడ్డి(మునుగోడు), రాష్ర్ట పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
బలోపేతానికి కృషి
Published Sun, Oct 19 2014 2:05 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement