worlds oldest man
-
ప్రపంచ కురు వృద్దుడు ఇక లేరు
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెస్తు వటనాబేకు ఐదుగురు సంతానం కాగా..12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించాడు. చిటెట్సు వటనాబె అగ్రికల్చర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తైవాన్‌లోని దాయ్-నిప్పన్ మెయిజి షుగర్ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. చిటెట్సు 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నాడు. అనంతరం మిట్సు అనే మహిళను వివాహమాడగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇంత వయస్సు మీదపడ్డ ఇప్పటికీ తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఎక్కువ ఆయుష్షుతో జీవించడానికి గల రహస్యాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ అని విలువైన సలహా ఇచ్చాడు. చదవండి: తన ఆయుష్షుకు గల సీక్రెట్‌ను చెప్పేసిన కురు వృద్దుడు -
సీక్రెట్ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు
టోక్యో: నిండు నూరేళ్లు చల్లగా బతుకు అని ఆశీర్వదిస్తుంటారు.. కానీ ప్రస్తుత జనరేషన్లో అది ఎంతవరకు సాధ్యమనేది ఎప్పటికీ ఓ భేతాళ ప్రశ్నగా మిగిలింది. చావు ఎప్పుడు ఏ వైపు నుంచి తరుముకు వస్తుందో తెలీని రోజులివి. పైగా మారుతున్న జీవనశైలితో అరవై ఏళ్లకే కన్నుమూస్తున్న దుస్థితి. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 112 సంవత్సరాల 334 రోజుల వయస్సుతో.. ప్రపంచంలోనే అత్యంత కురు వృద్దుడుగా బుధవారం గిన్నిస్ రికార్డు అందుకున్నాడు. గతంలోనూ జపనీస్‌కు చెందిన వ్యక్తిపై ఈ రికార్డు ఉండగా అతను గత నెలలో చనిపోయారు. దీంతో జీవించి ఉన్నవారిలో ప్రపంచంలోనే ఎక్కువ వయసుస్సున్న వ్యక్తిగా చిటెస్తు వటనబె రికార్డు నెలకొల్పాడు. అదే నా జీవిత రహస్యం.. 1907లో దక్షిణ జపాన్‌లోని నీగటలో చిటెస్తు వటనబె జన్మించాడు. స్థానిక వ్యవసాయ విద్యాలయంలో చదువు పూర్తి చేశాడు. అనంతరం తైవాన్‌కు వెళ్లి చెరకు ప్లాంటేషన్ కాంట్రాక్టు పనిలో కుదిరాడు. అక్కడే 18 సంవత్సరాలు నివాసం కొనసాగించాడు. అనంతరం మిట్సు అనే మహిళను వివాహమాడగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇంత వయస్సు మీదపడ్డ ఇప్పటికీ తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఎక్కువ ఆయుష్షుతో జీవించడానికి గల రహస్యాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ అని విలువైన సలహా ఇచ్చాడు. -
ప్రపంచ కురువృద్ధుడు కన్నుమూత
టోక్యో: ప్రపంచ కురువృద్ధుడు సకారి మొమోయ్(112) కన్నుమూశారు. ఈయన జపాన్ దేశస్తుడు. ఫిబ్రవరి 5, 1903 జన్మించిన మొమోయ్కు ప్రపంచ కురువృద్ధుడిగా ఆగస్టు 2014లో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. మధ్య జపాన్‌లోని ఫుకుషిమాలోగల మైనామిసోమా అనే ప్రాంతం ఆయన స్వస్థలం. గత ఫిబ్రవరిలోనే 112 ఏళ్ల పుట్టిన రోజు వేడుక కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోయి పనిచేయకుండా పోవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మొమోయ్ చనిపోవడంతో ఆయన స్థానంలోకి మరో జపాన్ వ్యక్తే ప్రపంచ పెద్ద కురువృద్ధుడిగా చోటు దక్కించుకున్నారు. యోసుతారో కోయిడే అనే పేరుగల ఆ వ్యక్తికి ప్రస్తుతం 112 ఏళ్లు. అయితే, ఆయనకు ఇంకా గిన్నీస్ రికార్డులో చోటు దక్కాల్సి ఉంది. -
111 ఏళ్ల తాతయ్య.. 115 ఏళ్ల బామ్మ!
లండన్: కలుషిత వాతావరణం, ఆహారం, పని ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి సగటు వయసు ఎంత? ఓ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు. అన్నీ సవ్యంగా సాగితే వందేళ్లు బతకగలమా? వామ్మో అన్నేళ్లా అనే సందేహం రావచ్చు. ఈ మాట వినగానే ఆశ్చర్యపడేవారు ఎక్కువగా ఉండొచ్చు. ఏ డెబ్బై, ఎనబై (!) ఏళ్ల బతికితే అదే గొప్పగా భావించవచ్చు. కానీ ప్రపంచంలో జీవించివున్న అతిపెద్ద వయస్కుడు, అతిపెద్ద వయస్కురాలిని గురించి వింటే ఈ ఆశ చిగురించవచ్చు. ప్రపంచంలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కుడిగా ఇటలీకి చెందిన వ్యక్తి రికార్డు సాధించాడు. ఆర్టురో లికాటా అనే వృద్ధుడు గిన్నెస్ బుక్‌లోకెక్కాడు. అతని వయసు ప్రస్తుతం 111 సంవత్సరాలా 302 రోజులు. లికాటా జనన, వివాహ ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అతణ్ని ప్రపంచ వృద్ధుడిగా గుర్తించారు. ఇక మహిళలలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కురాలిగా జపాన్ బామ్మ నిలిచింది. మిసావో ఒకావా వయసు 115 ఏళ్లు. లికాటా కంటే ఆమె నాలుగేళ్ల ముందు జన్మించింది. 1898 మార్చిలో ఒకావా.. 1902 మేలో లికాటా జన్మించారు. లికిటా 19 ఏళ్ల వయసులోని సైన్యంలో చేరి 18 ఏళ్లు పనిచేశాడు. ఆయన భార్య 78 ఏళ్ల వయసులోనే 1980లో మరణించింది. వీరికి ఏడుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవళ్లు, నలుగురు మునిమనవళ్లు సంతాన చక్రం. గిన్నిస్ బుక్ నిర్వాహకులు ప్రతి ఏటా ప్రపంచంలో అతిపెద్ద వయసు వారిని గుర్తించి సన్మానిస్తోంది. రికార్డుల ప్రకారం జీన్నె కామ్లెంట్ (ఫ్రాన్స్) అనే వ్యక్తి గరిష్టంగా 122 సంవత్సరాలా 164 రోజులు బతికాడు. ఆయన 1997లో మరణించాడు.