ప్రపంచ కురువృద్ధుడు కన్నుమూత
టోక్యో: ప్రపంచ కురువృద్ధుడు సకారి మొమోయ్(112) కన్నుమూశారు. ఈయన జపాన్ దేశస్తుడు. ఫిబ్రవరి 5, 1903 జన్మించిన మొమోయ్కు ప్రపంచ కురువృద్ధుడిగా ఆగస్టు 2014లో గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. మధ్య జపాన్లోని ఫుకుషిమాలోగల మైనామిసోమా అనే ప్రాంతం ఆయన స్వస్థలం. గత ఫిబ్రవరిలోనే 112 ఏళ్ల పుట్టిన రోజు వేడుక కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
కిడ్నీలు పూర్తిగా పాడైపోయి పనిచేయకుండా పోవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మొమోయ్ చనిపోవడంతో ఆయన స్థానంలోకి మరో జపాన్ వ్యక్తే ప్రపంచ పెద్ద కురువృద్ధుడిగా చోటు దక్కించుకున్నారు. యోసుతారో కోయిడే అనే పేరుగల ఆ వ్యక్తికి ప్రస్తుతం 112 ఏళ్లు. అయితే, ఆయనకు ఇంకా గిన్నీస్ రికార్డులో చోటు దక్కాల్సి ఉంది.