మరోసారి నోటి తీట తీర్చుకున్న అజాంఖాన్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజాం ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన నోటి తీట తీర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని బిజనోర్లో ఎన్నిక ప్రచారంలో భాగంగా అజాంఖాన్ మాట్లాడుతూ.... భారతదేశ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఇద్దరు కుమారులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, చిన్న కుమారుడు సంజయ్ గాంధీలు... వారి చేసిన పాపాలకు అల్లా ఆగ్రహానికి గురయ్యారని... అందుకే వారి జీవితం విషాదాంతంగా ముగిసిందని వెల్లడించారు. అందుకే రాజీవ్ 1991లో మానవబాంబు దాడిలో మరణించాగా, సంజయ్ 1980లో విమాన ప్రమాదంలో మృతి చెందారని చెప్పారు.
ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు సంజయ్ గాంధీ అడింది ఆట పాడింది పాటగా సాగిందని... ఆ సమయంలో దేశ యువతకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసిన సంగతిని అజాం ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే రాజీవ్ గాంధీ చేసిన పనులు కూడా అల్లా ఆగ్రహానికి గురైయ్యారని అజాం ఖాన్ ఆరోపించారు. అందుకే వారు అల్లా ఆగ్రహానికి గురై మరణించారని అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అజాంఖాన్, అమిషాలు బహిరంగ సభలలో ప్రసంగించ వద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కార్గిల్ యుద్దంపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్పై శనివారం యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.