తప్పు గ్రేడేషన్ ..జీఓ
పీఈటీలు, పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం 16 ఏళ్లుగా పోరాడిన ఉపాధ్యాయులను మభ్య పెట్టేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ జీఓలో షెడ్యూలు, విధి విధానాలు లేవు. ఇదేమిటని ఉపాధ్యాయులు అడిగితే.. ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. బాగానే ఉందనుకుంటే.. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ చేయడంలేదు. ఈ మెలిక ఏమిటన్న ప్రశ్నలకు సాకులు చెబుతున్నారే తప్ప, ఆ జీఓను అమలు చేయడం లేదు. ఇంతవరకూ చేసినట్టుగా తిరిగి పోరాట బాటలోకి వెళతామని ఉపాధ్యాయులు అంటున్నారు.
భానుగుడి (కాకినాడ) :
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. కుప్పలతెప్పలా పేరుకుపోయిన సమస్యలతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. ఇందులో అతీగతీ లేని నెలవారీ పదోన్నతులు, సంవత్సరానికో డీఎస్సీ తెస్తామన్న ప్రభుత్వ హామీ, ఉపాధ్యాయులను పాత పెన్ష¯ŒS స్కీము వర్తింపు, విద్యాసంవత్సరం మధ్యలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన తదితర సమస్యలు ఉపాధ్యాయులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్యల కోవలోకి పీఈటీల, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కూడా చేరింది. ఇందుకు సంబం«ధించిన జీఓ జారీ చేసి ఐదు నెలలైనా అమలు కాలేదు.
16 ఏళ్ల పోరాటం...
పీఈటీ, పండిట్లు 16 ఏళ్లుగా అప్ గ్రేడేష¯ŒS కోసం పోరాటం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఈ సమస్యను దాటవేశాయే తప్ప పరిష్కరించడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో పీఈటీ, పండిట్ల అప్ గ్రేడేష¯ŒS కోసం జీఓ 144ను విడుదల చేసింది. అయితే ఇంతవరకూ ఆ జోఓ అమలుకాలేదు. అప్‌గ్రేడేష¯ŒS షెడ్యులు లేకపోవడం, విధి వి«ధానాలు లేకుండా మొక్కుబడిగా జీఓ ఉంది. గతేడాది ఆక్టోబర్‌లో అప్‌గ్రేడేష¯ŒSకు ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి మాత్రం ఆదేశాలు రాలేదు.
నిరీక్షణలో 341 మంది ఉపాధ్యాయులు.
జిల్లాలో 166 పీఈటీ పోస్టులు, 105 తెలుగు పండిట్ పోస్టులు, 65 హిందీ, 5 సంస్కృత ఉపాధ్యాయుల పోస్టులు అప్‌గ్రేడ్ చేసినట్టు డీఈఓ వెబ్సైట్లో ఉంచారు. అయితే సీనియారిటీ జాబితా వివరాలు, కౌన్సిలింగ్ తేదీలు, విధి విధానాలు మాత్రం ఇందులో లేవు. ఈ విషయమై ఉపాధ్యాయులు అధికారులను ఎన్నిసార్లు కలిసినా విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి అదేశాలు రాలేదనే చెబుతున్నారు. అక్కడికు వెళితే నెలవారీ పదోన్నతుల కేసు కోర్టులో ఉందంటూ సాకు చెబుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలతో 164 జెడ్పీ పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ పీఈలుగా మార్పు చేస్తున్నట్టు, ఎల్పీలను ఎస్ఏలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు వెబ్సైట్లో ఉంచారు. అయితే ఉపాధ్యాయుల సినీయారిటీ లిస్టు, షెడ్యుల్స్ అందులో లేకపోవడంతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. తక్షణమే షెడ్యులు విడుదల చేసి పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒSను నిర్వహించకుంటే రోడ్డెక్కుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఉద్యమానికి దిగుతాం
పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కోసం 16 ఏళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా మా దుస్థితి మారడం లేదు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన జీఓలో విధివిధానాలు లేవు. ఇప్పటికైనా అప్‌గ్రేడేష¯ŒS పూర్తి చేయకుంటే ఉద్యమం చేపడతాం.
– ఎల్.జార్జి, పీఈటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
మాతో ఆటలా?
రాత్రికి రాత్రే జీఓలు జారీ చేసి, పనులు చకచకా చేసుకుంటున్న రోజులివి. ఉపాధ్యాయుల కొచ్చేసరికి కొర్రీలు వేస్తున్నారు. చాలామంది రిటైర్మెంట్కి దగ్గరకొచ్చినా పీఈటీగానే ఉన్నారు. 25 ఏళ్లు సర్వీసు చేసినా ఎస్ఏ క్యాడర్ లేదు. మాతో ఆటలాడటం సరికాదు.
– పప్పు శ్రీనివాసరావు, పీఈటీ, జెడ్పీహెచ్ఎస్, పవర
ఇక ఉద్యమమే
రాష్ట్ర స్థాయిలో ఉద్యమం నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాం. ఏ త్యాగానికైనా మేనుకాడం. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. ప్రభుత్వానికి మాపై కనికరం లేదు. జిల్లాలో ఉపాధ్యాయు లందరూ నిరీక్షిస్తున్నారు. వారు ఆగ్రహం చెందక ముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
– వి.మాచర్రావు, నేమాం జెడ్పీహెచ్ఎస్ పీఈటీ