wrote
-
ప్రధాని మోదీ డైరీలో మహాత్ముని వాక్కులు
జనవరి 30న అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1948లో ఇదే రోజున నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ గుజరాత్ నివాసి. మహాత్మా గాంధీ నేర్పిన పాఠాలు ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ గురించి లోతైన అధ్యయనం చేశారు. మహాత్మా గాంధీ తెలిపిన పలు విషయాలను ప్రధాని మోదీ తన పర్సనల్ డైరీలో రాసుకున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలు ట్విట్టర్ హ్యాండిల్ ‘మోదీ ఆర్కైవ్’లో షేర్ అయ్యాయి. ప్రధాని మోదీ తన డైరీలో రాసుకున్న మహాత్మా గాంధీకి సంబంధించిన అమూల్య విషయాలు దీనిలో ఉన్నాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలను యూజర్స్ కోసం అందుబాటులో ఉంచామని ‘మోదీ ఆర్కైవ్’ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనిని చూస్తే ప్రధాని మోదీ మహాత్మాగాంధీ గురించి వివరంగా చదవడమే కాకుండా, గాంధీజీ చెప్పిన అమూల్యమైన విషయాలను తన వ్యక్తిగత డైరీలో రాసుకున్నారని తెలుస్తుంది. ఇవి ప్రధాని మోదీకి మార్గదర్శకంగా నిలిచాయి. మహాత్మా గాంధీ తన 78 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ కాంప్లెక్స్‌లో నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని కాల్చి చంపాడు. భారతదేశ విభజనపై గాంధీ అభిప్రాయాలను గాడ్సే వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గౌరవార్థం ఆయనను గుర్తుచేసుకుంటూ జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. We bring to you pages from @narendramodi's personal diary, which demonstrate that not only did he extensively read #MahatmaGandhi, but he also wrote down Gandhi's quotes in his personal diary as something of inspirational value to him. These entries continued to guide his… pic.twitter.com/MCvgCBMCx1 — Modi Archive (@modiarchive) January 30, 2024 -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
'నా మానసిక ఆరోగ్యం బాగోలేదు'
వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ మరోసారి తెరపైకి వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆ నేపథ్యంలోనే తప్పుడు ఆర్డర్ పంపానని భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ జె.ఎస్ కెహర్, జస్టిస్ ఆర్.భానుమతికి తెలియజేశారు. కొందరు సహచర న్యాయమూర్తులు ఎగతాళి చేయడంతో మానసికంగా కుంగిపోయానని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్నన్ తెలిపారు. అయితే ఆ న్యాయమూర్తులు ఎవరన్న వివరాలను మాత్రం చెప్పలేదు. భవిష్యత్తులో తన వైఖరి సక్రమంగా ఉండేలా చూసుకుంటానని, అటువంటి తప్పులు తిరిగి జరగకుండా చూసుకుంటానని జస్టిస్ కర్నన్ తన లేఖలో హామీ ఇచ్చారు. తాను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇతర న్యాయమూర్తుల వేధింపులకు గురౌతున్నానని, కొన్ని సందర్భాల్లో తనను ఎగతాళి చేస్తున్నారని గతంలో ఆ విషయాన్నిసిజిఎఫ్ జాతీయ కమిషన్ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తాజా లేఖలో తెలిపారు. తనను వేధించిన జడ్జిల పేర్లను వెల్లడించలేదని, న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని నిర్మూలించాలని, మత సామరస్యాన్ని కాపాడటంలో న్యాయవ్యవస్థ ముందుండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్.. గతంలో జస్టిస్ కర్నన్ ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీచేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆ ఉత్తర్వులపై ఏకపక్షంగా స్పందిస్తూ తనకు తానే సుమోటోగా చర్యలు తీసుకుంటూ నిర్ణయం ప్రకటించుకున్న కర్నన్.. తనను బదిలీ చేయడానికి గల కారణాలను భారత ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 15లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే మద్రాస్ హైకోర్ట్ విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 12న కర్నన్ జారీచేసిన అన్ని ఉత్తర్వులపైనా జస్టిస్ కెహర్ నేతృత్వంలోని బెంచ్ స్టే విధించింది. తిరిగి నోటీసులు అందేవరకూ కర్నన్ కు ఎటువంటి జ్యుడీషియల్ వర్క్ అప్పగించరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలిచ్చారు. తర్వాత ఓసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ను జస్టిస్ కర్నన్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా తన ప్రవర్తనకు గల కారణాలను వివరిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
అదనపు కట్నం కోసం భర్తే చంపేశాడని బంధువుల ఆరోపణ ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు పలమనేరు టౌన్, న్యూస్‌లైన్: పలమనేరులో ఒక వివాహిత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం భర్తే ఆమెను చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలం ఒగ్గువారిపల్లెకు చెందిన చంద్రయ్య కుమార్తె రాసా (23)కు పలమనేరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు అర్జున్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. రాసా తల్లిదండ్రులు పెళ్లి చేయడమేగాక రూ.2 లక్షల నగదు, ఏడు సవర్ల నగలు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం రోజులు కాపురం సజావుగా సాగింది. నాలుగు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ అర్జున్ భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని రాసా తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. వారం రోజుల క్రితం ఆటో కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయలు కావాలంటూ అర్జున్ భార్యతో గొడవపడ్డాడు. అత్తమామలు అప్పుచేసి రూ.50వేలు ఇచ్చారు. మిగిలిన రూ.50వేల కోసం వేధింపులు ప్రారంభించాడు. తన తల్లిదండ్రుల వద్ద ఇక డబ్బు లేదని రాసా చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన భార్య ఉరేసుకుని కొన ఊపిరితో ఉందంటూ అర్జున్ చుట్టుపక్కల వారికి తెలిపాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అర్జున్ పరారయ్యాడు. కుమార్తె మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. తమ బిడ్డను అల్లుడే చంపి, నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మృతురాలికి ఏడాదిన్నర వయస్సు గల బిడ్డ ఉంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.