X Graecia
-
గని ప్రమాదంలో కార్మికుడి మృతి
► ఆర్కే న్యూటెక్‌లో అదుపుతప్పి ఢీకొట్టిన ఎస్డీఎల్ యంత్రం ► కాలు విరిగిన టింబర్‌మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ► రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాకు కార్మిక సంఘాల డిమాండ్ శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఆర్కే న్యూటెక్ గనిలో టింబర్‌మన్ కార్మికుడు ఎడ్ల మల్లయ్య(59) ఎస్డీఎల్ యంత్రం ఢీకొని మృతి చెందా డు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి షిఫ్టు డ్యూటీకి హాజరైన మల్లయ్య గనిలోని 41 డిప్ స్లైస్ఆఫ్, 31 లెవల్, 1ఏఎస్3 ప్యానల్ వద్ద తోటి కార్మికులతో విధులు నిర్వర్తిస్తున్నాడు. కింది వైపు దిమ్మెలు కట్టాల్సి ఉంది. ఇందుకు దిమ్మెలను అక్కడున్న ఎస్డీఎల్ యంత్రం బకెట్ లో నింపి దానిని పని స్థలం వద్దకు తరలించేందుకు ఏర్పా టు చేసుకున్నాడు. ఈక్రమంలో మరో కార్మికుడు యంత్రా ని నడుపుకుంటూ వస్తుండగా పని స్థలం వద్ద ఆపినా అదుపు కాకజారుకుంటూ వెళ్లి మల్లయ్యను ఢీకొట్టింది. దీంతో బకెట్ కింద అతడి కుడి కాలు నలిగి విరిగిపోయిం ది. తోటి కార్మికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు మల్లయ్యను రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించా రు. తీవ్ర రక్తస్రావం కావడంతో కరీంనగర్ అపోలో రీచ్‌కు పంపించారు. మల్లయ్య అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ప్రమాద స్థలాన్ని ఏజెంట్ జాన్ఆనంద్, గని మేనేజర్ వెంగళ్రావు సందర్శించారు. ప్రమాదపై జీఎం సుభాని సమీక్షించారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి మృతుడి కుటుంబానికి మ్యాచింగ్ గ్రాంట్‌తో సరిపెట్టకుండా రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు ఒక ప్రకటనలో యూజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మృత్యు శతకం
► రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ బాధితులు ► ఇప్పటిదాకా దాదాపు వంద మంది మృతి ► 14 మందేనంటున్న అధికారులు ► ఎక్స్‌గ్రేషియాపై కొరవడిన స్పష్టత అనంతపురం అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ‘అనంత’ అగ్నిగోళంగా మారింది. వడదెబ్బకు జనం మృత్యువాత పడుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద మంది చనిపోయారు. అధికారులు మాత్రం ‘అంత’ లేదంటున్నారు. 14 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నారు. వారు చెబుతున్న సంఖ్య వాస్తవ విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన మార్చి నుంచి ప్రతి రోజు సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతూనే ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లోనే 10 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడదెబ్బకు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారు, పేదలే కావడం గమనార్హం. అన్నీ కాదంటున్న అధికారులు వైద్యులు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలన్నీ వడదెబ్బ కారణంగా సంభవించినవి కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారి దృష్టికి 40 వరకు కేసులొస్తే అందులో 14 మాత్రమే వడదెబ్బతో చనిపోయినవిగా నిర్ధారించారు. మిగతా వారు అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేల్చారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారుల వాదన ఇలా ఉంది. ‘గుండె జబ్బులు, బీపీ, ఇతర వ్యాధులు ఉన్నవారు ఎందుకు ఎండలో తిరగాలి? ఉపాధి పనులు కూడా ఉదయం 6 నుంచి 10లోపు ముగించాలని చెబుతున్నాం కాదా! ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయించాం. ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎండలోకి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతే అది వడదెబ్బ మృతి ఎలా అవుతుంది?’అని లాజిక్‌లు మాట్లాడుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఎంతిస్తారో... వడదెబ్బ మృతులకు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని, అయితే అది ఎంత మొత్తం నిర్ధారణ కాలేదని అంటున్నారు. జీవో విడుదల చేస్తేకానీ చెప్పలేమంటున్నారు. ప్రజాశ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు. అందుకే వడదెబ్బ మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. చనిపోయిన వారంతా పేదలే. పౌష్టికాహారం లేక రోగనిరోధక శక్తి తగ్గి.. ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్నారంటే వడదెబ్బ మృతి కిందకే వస్తుంది. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
గని ప్రమాదానికి అధికారులే కారకులు
బెల్లంపల్లి : మందమర్రి ఏరియా శాంతిఖనిలో జరిగిన గని ప్రమాదానికి సింగరేణి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. బుధవారం బెల్లంపల్లికి వచ్చిన ఆయన ఇటీవల పైకప్పు కూలి శాంతిఖని గనిలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు మృతుల చిత్రపటాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నంబర్ 2 ఇంక్లైన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే పైకప్పు కూలి హన్మంతరావు, పోశం, కిష్టయ్య ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బొగ్గు గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని అన్నారు. శాంతిఖని గనిలో కొన్నాళ్ల నుంచి సేఫ్టీని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు అధికోత్పత్తి సాధించాలనే కాంక్షతో అధికారులు కంటిన్యూయస్ మైనర్ యంత్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారే తప్ప సేఫ్టీని పట్టించుకోలేదన్నారు. గని ప్రమాదం, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అంశాలపై సింగరేణి సీఅండ్ఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. సమావేశంలో టీవీవీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పి.సంజీవ్, ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు జి.మోహన్, జిల్లా బాధ్యుడు అడ్లూరి వెంకటస్వామి,కాంగ్రెస్ బల్దియా ఫ్లోర్ లీడర్ కటకం సతీష్ కుమార్, రిటైర్డు ఏఈ కనకయ్య, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.