yadhagiri
-
ఫర్నిచర్, మొక్కలు బాగున్నయ్
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో వీవీఐపీలు, వీఐపీల బస కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, 14 విల్లాలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. మధ్యాహ్నం 1:09 గంటలకు గండి చెరువుకు చేరుకున్న సీఎం.. 1:11 గంటలకు రింగ్‌రోడ్డు మీదుగా ప్రెసి డెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రెసిడె న్షియల్ సూట్ ప్రధానద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి సూట్‌ను పరిశీలించారు. సుమారు 21 నిమిషాలపాటు సూట్‌ను తిలకించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తు, గదుల్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, లాన్, మొక్కలను పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. సూట్‌కు ముందు భాగంలో నిర్మించిన భారీ ఎంట్రన్స్ వివ రాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివ రించారు. సీఎం వెంట సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
ముగిసిన సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలు దేరారు. కాగా వచ్చే నెల 21 నుంచి 28 వరకు జరగనున్న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిని సందర్శనకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్.. యాదాద్రికి చేరుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆపై ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. తుది దశకు చేరిన పనులు... ఆలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలు, విద్యుదీకరణ, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్నప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టెర్మినళ్ల వంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానాలయంలో పరంజాలు కడుతుండగా బస్‌బేలు, సత్యనారాయణ వ్రత మండపం, అన్నదాన కేంద్రానికి శ్లాబులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానాలయానికి స్వాగత తోరణం, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. -
గోవిందా అని పిలిచినా..
– టీటీడీ పరిపాలనా భవనం ఎదుట హోరెత్తిన వత్తి కళాకారుల దీక్ష –సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన –కళాకారుల దీక్షలను పలు పార్టీల సంఘీభావం తిరుపతి అర్బన్ : శ్రీవారి సేవలను విస్తృతం చేసే కళాకారుల సమస్యల పట్ల టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. జానపద వృత్తికళాకారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. కర్ణాటక, తమిళనాడుతో పాటు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన కళాకారులు ఈ ఆందోళనపథంలో పాల్గొంటున్నారు. దీక్షలకు వైఎస్సార్సీపీ, మహిళా కాంగ్రెస్, సీపీఐ, లోక్‌సత్తా, సంఘీభావం తెలిపాయి. కళాకారులు గోవిందనామ సంకీర్తన, భజనలతో మార్మోగించారు. తమ సమస్యలు పరిష్కారం చేసే వరకు దీక్షలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గౌరవ పారితోషికం ఇవ్వాలని, వాయిద్య పరికరాలు అందించాలని, అర్హులైన భజన గురువులకు శిక్షణ ఇవ్వాలన్న డిమాండ్‌తో 176 భజన బృందాలు దీక్షలో పాల్గొంటున్నాయి. గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. చంటిబిడ్డలు, వృద్ధులతో వారు రోడ్లపై పడుతున్న అవస్థలు దయనీయంగా ఉన్నాయి. చంటిబిడ్డలకు పుట్‌పాత్‌లపై చెట్లకొమ్మలకు ఊయల కట్టి లాలించడం కదిలించింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ప్రజల్లో భక్తి చైతన్యాన్ని నింపుతూ శ్రీవారి ప్రాశస్త్యాన్ని నలుదిశలా ప్రచారం చేస్తున్న కళాకారుల దీనవస్థలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కళాకారుల సంప్రదాయాన్ని మెరుగు పరుస్తున్నామన్న అధికారుల మాటలు హామీలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవకోన రాజేంద్ర మాట్లాడుతూ కళాకారులపై కూడా వివక్ష చూపడం తగదన్నారు. స్వామి వారి వైభవాన్ని కళా రూపాలతో ప్రపంచానికి తెలియజేస్తున్న కళాకారుల సమస్యలపై ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. మహిళాకాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఉద్యమాలు చేసిన ప్రతిసారీ అధికారులు హామీలతో సరిపెడుతుండడంతో ఈసారి దీక్షలకు దిగారని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ టీటీడీ అధికారులు అనవసర పనులకు కోట్లాదిరూపాయల ఖర్చులు పెడుతూ భజన సంప్రదాయాన్ని కొనసాగించే కళాకారులకు ఖర్చు చేసేందుకు మాత్రం ఆలోచించడం విడ్డూరమన్నారు. ప్రజానాట్యమండలి నాయకుడు పెంచలయ్య, గుర్రప్ప, మునీంద్ర, నాగరాజు, జానపద కళాకారులు అమరనా«ద్, సుబ్బారెడ్డి, రఫీ, జగన్, వెంకటాచలపతి, రవితేజ, రాజగోపాల్, హనుమంత రాయుడు తదితరులు పాల్గొన్నారు.