అపార్ట్మెంట్లో అశ్లీల నృత్యాలు
ముగ్గురు యువతులు సహా 9 మంది అరెస్ట్
హైదరాబాద్: యాప్రాల్ డివిజన్ పరిధిలోని రిజిస్టేషన్ కాలనీలో ఉన్న ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న ముగ్గురు యువతులుసహా 9 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్ కాలనీలోని ఓ అపార్ట్మెం ట్లో దిలీప్ కుమార్ జైన్ (50) రెండేళ్ల క్రితం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని విజయ్‌ఠాగూర్ (28), ఎండీ వాజీత్ (28)లతో కలసి నివసిస్తున్నాడు. ఇక్కడ కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి ఫ్లాట్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ యువతులతో అశ్లీల నృత్యాలు కొనసాగుతున్నాయి.
ముంబై, ఢిల్లీ, ఒడి శా రాష్ట్రాలకు చెందిన బిన్ని శర్మ (25), సోనియా (20), సిమ్రాన్‌సింగ్ (21)లతోపాటు మౌలాలికి చెందిన శంకర్‌పటేల్ (45), చార్మినార్‌కు చెందిన జావేద్(40), నయాపూల్‌కు చెం దిన పర్వేజ్ (38)లను పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి రూ.41,910 నగదు, 3 కార్లు, నాలు గు సెల్ఫోన్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు దిలీప్‌కుమార్‌జైన్,విజయ్ ఠాగూర్, వాజిత్లను కూడా అరెస్టు చేశారు.