youg man
-
నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు
ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్‌లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చౌటుప్పల్ (మునుగోడు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ధర్మోజిగూడెం గ్రామ స్టేజి వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జైకేసారం గ్రామానికి చెందిన జోగు రవి (22)లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లారీని ధర్మోజిగూడెం స్టేజి వద్ద ఉన్న టైర్ల పంచర్ దుకాణం వద్ద నిలిపాడు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. -
నవ వరుడి అనుమానాస్పద మృతి
పాతవెలగలపాలెం (రాజవొమ్మంగి) :పెళ్లయిన తర్వాత సాంప్రదాయం ప్రకారం అత్తవారింట్లో మూడు రోజులు గడిపేందుకు వచ్చిన వరుడు అనుకోని రీతిలో మూడోరోజు మంచంపై శవమై కనిపించాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన శనివారం ఉదయం రాజవొమ్మంగి మండలం పాత వెలగలపాలెం గ్రామంలో చోటు చేసుకొంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ శివరామపట్నం గ్రామానికి చెందిన సోముల రాజు(23) వెలగలపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిని ఈ నెల 22 న తన స్వగ్రామంలో వివాహం చేసుకున్నాడు. మర్నాడు రాజు తన భార్య లక్ష్మి, అక్క, బావలతో అత్తవారి ఇంటికి వచ్చాడు. 24తేదీ ఉదయం రాజు మంచంపై అచేతనంగా పడివుండటాన్ని కుటుంబీకులు కనుగొన్నారు. ఈ సంఘటన జరిగే సమయానికి పెండ్లి కుమారుని కుటుంబీకులు కూడా అదే ఇంట్లోవున్నా ఈ ఘోరం ఎలా జరిగిందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నారు. దీంతో మృతుడి అక్క అర్జమ్మ వెంటనే జడ్డంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక సీఐ కేఎన్ మోహనరెడ్డి, ఎస్సై నల్లమల లక్ష్మణబాబులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మర్మావయాలపై, మెడ, ఎడమ భుజంపై ఇనుప సూదులతో పొడిచినట్టు 50 నుంచి 60 వరకు గాయాలు ఉన్నట్టు సీఐ, ఎస్సైల పరిశీలనలో తేలింది. స్థానిక వీఆర్వో హంస తులసి, స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా అనంతరం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మా కుమారుడిని పథకం ప్రకారమే హత్య చేశారు.. మా కుమారుడు లక్ష్మిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడని, ఇరు కుటుంబాల వారి ఇష్టప్రకారమే పెళ్లి చేశామని మృతుడి తల్లిదండ్రులు పాడి రాంబాబు, గంగ స్థానిక విలేకరులకు తెలిపారు. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే గోకవరం నుంచి వెలగలపాలెం వచ్చారు. తమ కుమారుడిని లక్ష్మి కుటుంబీకులే పథకం ప్రకారం మట్టుపెట్టారని, సమగ్ర దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని కోరారు.