నేను బతికే ఉన్నా..చనిపోలేదు: విప్లవ్
హైదరాబాద్: యువ దర్శకుడు విప్లవ్ కోనేటి(33) అనారోగ్యంతో మృతి చెందనట్లు వదంతులు హల్ చల్ చేశాయి. ఆ పుకార్లను విప్లవ్ ఖండించాడు. తాను బతికే ఉన్నానని, అయితే అనారోగ్యం కారణంగా తన సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు చెప్పాడు. తాను బతికే ఉన్నట్లు విప్లవ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో తెలిపాడు.
విప్లవ్ ఎంబీబీఎస్ పూర్తి చేసినా.. సినీమాల మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలో ప్రవేశించారు. జగపతిబాబు హీరోగా నటిస్తున్న హితుడు చిత్రానికి విప్లవ్ కోనేటీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కోటీ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది.
I fell ill , hospitalized and cut myself off from phones. TRUE. Rest is a mystery .
And I love death , I openly confessed it in my writings , art , talks. I learnt a lot from death which I observed from close quarters while I am in Medicine. DEATH is no joke for me. this is all because of a disturbance which I could not control and trying to control. I will try tougher measures so that such "disturbances" do not disturb other people.