యువకుడి సజీవదహనానికి యత్నం...
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దశంకరంపేటలో ఆస్తి వివాదాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఓ యువకుడ్ని బంధువులు సజీవదహనం చేయడానికి యత్నించడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.