సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,76,372 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,987. వైరస్ బాధితుల్లో కొత్తగా ఒక్కరు కూడా మృత్యువాతపడలేదు.. మొత్తం మృతుల సంఖ్య 7,139గా ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment