సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారవర్గాల సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఏపీ: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Published Fri, Aug 6 2021 9:18 AM | Last Updated on Fri, Aug 6 2021 3:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment