
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..ఏపీ ఇంధన శాఖ అధికారులను అభినందించారు. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్‌ను ఇంధన శాఖ ఉన్నతాధికారులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారిని అభినందించారు.
కాగా, ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2023ని ఏపీ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఇంధన శాఖ ఉన్నతాధికారులు సోమవారం కలిశారు. వారు సీఎం జగన్‌ను కలిసి అవార్డు వివరాలను తెలియజేశారు. ఇక, ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ అధికారులు అవార్డును అందుకున్నారు. అయితే, వరుసగా రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకుని ఏపీ రికార్డు సృష్టించింది.
ఇక, ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీఏవీపీ కుమారరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment