సాక్షి, విశాఖపట్నం: అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘చెగ్’ విశాఖపట్నంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ దేశంలో ఢిల్లీ తర్వాత విశాఖలోనే తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా 2005లో ప్రారంభమైన చెగ్ సంస్థ.. 2013లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ప్రవేశించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ ట్యూటరింగ్, మెంటార్, స్కాలర్‌షిప్స్, ఇంటర్న్‌షిప్, అడ్వాన్స్‌డ్ రైటింగ్ తదితర సేవలను చెగ్ సంస్థ అందిస్తుంటుంది. అలాగే డిజిటల్, ఫిజికల్ విధానంలో పాఠ్యపుస్తకాలను అద్దెకు ఇస్తుంటుంది.
ఈ సంస్థ 2021లో అమెరికాలో యూనివర్సిటీని కూడా ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. విద్యార్థులకు అవసరమైన సేవలతో పాటు ఆన్‌లైన్ సంపాదనకు అత్యంత విలువైన ట్రెండింగ్ మార్గాలు, కెరీర్ గైడెన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు, దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు అవసరమైన మెటీరియల్‌ను అందించే బ్రాంచ్‌ను విశాఖలో ప్రారంభించినట్లు ‘చెగ్’ ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment