సామినేని దంపతులతో కలసి కేక్ కట్ చేస్తున్న సీఎం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు సీఎం జగన్‌కు ఆయన నివాసంలో వేద ఆశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు రక్తదానం చేశారు.
జగ్గయ్యపేటలో..
జగ్గయ్యపేట అర్బన్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్ కళాశాల గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, విమలాభాను దంపతుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరూరా అభిమానులు కేక్ కట్‌చేసి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు తమ ఇంట్లో సోదరుడి పుట్టినరోజులాగా భావిస్తూ ఆనందంగా కనిపించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లోను నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా వేలాదిమంది రక్తదానం చేశారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కురసాల కన్నబాబు 151 కిలోల కేక్ కట్ చేశారు.
తిరుపతిలో నవరత్న పథకాల ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్తున్న ఎమ్మెల్యే భూమన, మహిళా కార్యకర్తలు, అభిమానులు, తూ.గోదావరి జిల్లా దివాన్‌చెరువులో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
రాజానగరం మండలం దివాన్‌చెరువు ఫంక్షన్‌హాలులో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాల్‌పురంలో జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు లాల్‌పురం రాము ఆధ్వర్యంలో రైతులు పంట పొలాల్లో కేక్ కట్ చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఏసురత్నం ఆధ్వర్యంలో యార్డు ఆవరణలో 35 అడుగుల జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి భారీ క్రేన్ సహాయంతో ఎండుమిర్చిని వెదజల్లి దిష్టి తీశారు. పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 25 వేలమంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు నవరత్న పథకాల ప్లకార్డులతో రెండు కిలోమీటర్ల మేర ప్రదర్శన నిర్వహించారు.
జై జగనన్న నినాదాలతో తిరుపతి నగరం మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన పి.బుద్ది అనే మహిళ పూండి జంక్షన్‌లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసింది. కష్టార్జితాన్ని వెచ్చించి కేక్ కొని పంచిపెట్టి అభిమానాన్ని చాటుకుంది. విశాఖ జిల్లాలో 200 మంది నేత్రదానానికి అంగీకరిస్తూ పత్రాలు అందజేశారు. తగరపువలసలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరంలో సుమారు ఐదువేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. నర్సీపట్నంలో 70 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రితో పాటు ఆ నియోజకవర్గంలోని ఏడు పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు ఉపయోగపడేలా 50 వీల్‌చైర్లను సమకూర్చారు.
తెలంగాణలో..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును తెలంగాణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తమ పారీ్టకి కోటికిపైగా ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతాసాగర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పాకాల డేనియల్, రాష్ట్ర కార్యదర్శులు కొయ్యాడ మహేశ్‌కుమార్, మాజిద్‌ఖాన్, సోమన్న, రాజశేఖర్, భూమిరెడ్డి, సాధిక్‌రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment